Srikanth Odela and Chiranjeevi : తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఎనలేని గుర్తింపైతే ఉంది. ఆయనతో సినిమాలు చేయడానికి యంగ్ డైరెక్టర్స్ సైతం పోటీ పడుతున్నారని చెప్పడంలో ఎంతమాత్రం అతిశయోశక్తి లేదు. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలు మంచి విజయాలను సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక గొప్ప గుర్తింపును కూడా తీసుకొచ్చి పెడుతున్నాయి. మరి ఇలాంటి సందర్భంలోనే శ్రీకాంత్ ఓదెల లాంటి దర్శకుడు సైతం చిరంజీవితో సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇక ప్రస్తుతం ఆయన నాని హీరోగా ‘ప్యారడైజ్’ అనే సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు ఒకెత్తయితే ఇకమీదట సాధించబోయే విజయాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్ ను మారుస్తూ కొత్త ఇమేజ్ నిచ్చే విధంగా శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) ఈ స్క్రిప్ట్ ను గ్యాంగ్ స్టర్ నేపధ్యం లో డిజైన్ చేశారట. డిఫరెంట్ మేకింగ్ తో ఈ సినిమాని తెరకెక్కించబోతున్నట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో మన దర్శకులు మంచి గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న క్రమంలో కొత్తగా వస్తున్న స్టార్ డైరెక్టర్లు సైతం వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు. మరి శ్రీకాంత్ ఓదెల ఇంతకుముందు నానితో చేసిన దసర సినిమా సూపర్ డూపర్ సక్సెస్ సాధించింది.
Also Read : చిరంజీవి శ్రీకాంత్ ఓదెల సినిమాలో విలన్ గా తమిళ్ స్టార్ హీరో…
ఇప్పుడు నానితో చేస్తున్న ప్యారడైజ్ (Paradaise) సినిమా కూడా భారీ విజయాన్ని సాధించే విధంగా ఆ సినిమాని తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక చిరంజీవితో చేయబోతున్న సినిమా కోసం ఆయన చాలా కసరత్తులను కూడా చేస్తున్నారట.
అయితే ఈ సినిమాలో విలన్ గా మలయాళం స్టార్ హీరో అయిన మమ్ముట్టి నటించబోతున్నాడనే వార్తలు కూడా వస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనే విషయాలు తెలియవు గాని మొత్తానికైతే మెగాస్టార్ చిరంజీవి సినిమాలో మరో మెగాస్టార్ అయిన మమ్ముట్టి నటించడం అనేది మామూలు విషయం కాదు.
ఒకవేళ ఈ న్యూస్ కనక నిజమే అయితే ఆ సినిమా రిలీజ్ కి ముందే ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. మరి ఈ సినిమాతో అటు చిరంజీవి, ఇటు శ్రీకాంత్ ఓదెల ఇద్దరు వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
Also Read : చిరంజీవి, శ్రీకాంత్ ఓదెల ఇద్దరు కలిసి రక్తంతో తడిపేశారు..ఈ మూవీ ఇండస్ట్రీ హిట్ కొడుతుందా..?