Mumbai Indians vs Gujarat Titans : ముల్లాన్ పూర్ మైదానంలో హార్దిక్ పాండ్యా టాస్ టాస్క్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఇంకేముంది పంజాబ్ మాదిరిగానే ఇక్కడ కూడా పిచ్ సహకరిస్తుందని.. గుజరాత్ బౌలర్లకు పండగేనని అందరూ అనుకున్నారు. ముఖ్యంగా అద్భుతంగా బౌలింగ్ వేస్తూ.. వికెట్ల మీద వికెట్లు తీస్తూ దూసుకుపోతున్న సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ వంటి బౌలర్లు ఉండడంతో గుజరాత్ అభిమానులకు విపరీతమైన ధీమా పెరిగిపోయింది. కానీ అది పాలపొంగు లాంటిదేనని రుజువు అవ్వడానికి ఎంతో సమయం పట్టలేదు. వాస్తవానికి ఈ మ్యాచ్ లో విల్ జాక్స్ స్వదేశంలో జాతీయ జట్టుకు ఆడాల్సి రావడంతో వెళ్లిపోయాడు. దీంతో రోహిత్ శర్మ, జానీ బెయిర్ స్టో ముంబై ఇండియన్స్ జట్టు తరఫున ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. వీరిద్దరూ భీకరంగా బ్యాటింగ్ చేశారు. తొలి వికెట్ కు 7.2 ఓవర్లలోనే 84 పరుగులు చేశారు. ముఖ్యంగా జానీ 22 బంతుల్లో 47 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు ఫోర్లు మూడు సిక్సర్లు ఉన్నాయి. ఇక రోహిత్ శర్మ అయిత వరకు 81 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్ లో 9 ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి.. మరో కీలక ఆటగాడు సూర్య కుమార్ యాదవ్ 20 బంతుల్లో ఒక ఫోర్, మూడు సిక్సర్ల సహాయంతో 33 పరుగులు చేశాడు..
Also Read : అశ్విన్, రోహిత్, విరాట్ బాటలో.. రిటైర్మెంట్ పై బాంబు పేల్చిన బుమ్రా!
వాస్తవానికి ముంబై జట్టు ఈ స్థాయిలో స్కోర్ చేసేది కాదు. ముఖ్యంగా ముంబై ఆటగాళ్లలో రోహిత్ శర్మకు రెండు జీవధానాలు, సూర్య కుమార్ యాదవ్ కు రెండు జీవధానాలు లభించాయి. ఈ అవకాశాలను వారు సద్వినియోగం చేసుకొని బీభత్సంగా బ్యాటింగ్ చేశారు.. ప్రసిద్ కృష్ణ బౌలింగ్లో మూడు పరుగుల వద్ద రోహిత్ ఇచ్చిన క్యాచ్ ను బౌండరీ లైన్ వద్ద ఉన్న కోయేడ్జి నేలపాలు చేశాడు.
సిరాజ్ బౌలింగ్ 2.4 ఓవర్ లో రోహిత్ ఇచ్చిన క్యాచ్ ను వికెట్ కీపర్ కుశాల్ మేండిస్ వదిలేశాడు. అప్పటికి రోహిత్ స్కోర్ 12 పరుగులు.
కోయేడ్జీ బౌలింగ్లో 12.4 ఓవర్ వద్ద.. సూర్య కుమార్ యాదవ్ ఇచ్చిన క్యాచ్ ను కీపర్ కుశాల్ మేండిస్ వదిలేసాడు. అప్పటికి సూర్య కుమార్ యాదవ్ స్కోర్ 26 పరుగులు.
ఇలా లభించిన జీవధానాలను రోహిత్ శర్మ అద్భుతంగా వినియోగించుకున్నాడు. గుజరాత్ బౌలర్లను ఊచ కోత కోశాడు. బీభత్సంగా బ్యాటింగ్ చేసి ముంబై స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. తద్వారా నాకౌట్ మ్యాచ్లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి.. సరికొత్త చరిత్ర సృష్టించాడు. గుజరాత్ ఫీల్డర్లు కనుక క్యాచ్లు కనుక పట్టి ఉంటే ముంబై జట్టు ఈ స్థాయిలో స్కోర్ చేసి ఉండేది కాదు.