Puri Jagannadh Meets Vijayendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది పూరి జగన్నాధ్ (Puri Jagannadh) అనే చెప్పాలి… ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలు అతనికి గొప్ప గుర్తింపును సంపాదించి పెట్టాయి. కెరియర్ స్టార్టింగ్లో వరుస సక్సెస్ లను సాధించిన ఆయన గత కొన్ని సంవత్సరాల నుంచి సరైన సక్సెస్ లను సాధించలేకపోతున్నాడు. కారణం ఏదైనా కూడా ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది. ప్రస్తుతం ఆయన మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి తో ‘బెగ్గర్’ (Beggar) అనే సినిమాని చేయబోతున్నాడు. అయితే ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ ను ఫిక్స్ చేసిన పూరి తొందరలోనే ఈ సినిమాను సెట్స్ మీదకి తీసుకెళ్లాలనే ఉద్దేశ్యంతో ఉన్నట్టుగా తెలుస్తోంది… రీసెంట్ గా పూరి జగన్నాధ్ ఇండియాలోనే స్టార్ రైటర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న విజయేంద్ర ప్రసాద్ (Vijayendra Prasad)ని కలిసి అతనితో ఒక ఫోటో దిగి దాన్ని షేర్ చేశాడు. అయితే పూరి జగన్నాధ్ విజయేంద్ర ప్రసాద్ ని కలవడానికి గల కారణం ఏంటి అనే కోణంలో కొన్ని వార్తలైతే వస్తున్నాయి. ఇక ఇంతకుముందు విజయేంద్రప్రసాద్ ఒకానొక సందర్భంలో పూరి జగన్నాధ్ కి కాల్ చేసి స్క్రిప్ట్ రాసుకున్న తర్వాత నాకు ఒకసారి వినిపించండి. ఏవైనా చేంజెస్ ఉంటే చేసి పెడతానని చెప్పారట. అయినప్పటికీ పూరి జగన్నాధ్ మాత్రం ఇప్పటివరకు ఆయనకు కథను చెప్పలేదు.
Also Read: మహేష్ బాబు రాజమౌళి సినిమా రిలీజ్ కి ముందే 1500 కోట్ల బిజినెస్ చేయబోతుందా..?
మరి ఫస్ట్ టైం బెగ్గర్ సినిమా కథని అతనికి వినిపించి ఆయన చెప్పే సజేషన్స్ ను తీసుకోవాలని ఫిక్స్ అయినట్టుగా తెలుస్తోంది. అందుకోసమే రీసెంట్ గా అతన్ని కలిసి అతనితో ఒక ఫోటోను కూడా షేర్ చేశాడు. మొత్తానికైతే విజయేంద్ర ప్రసాద్ పుణ్యమా అని పూరి జగన్నాథ్ ఈ సినిమాతో సక్సెస్ ని సాధిస్తే చూడాలని చాలామంది అభిమానులు కోరుకుంటున్నారు.
నిజానికి డబుల్ ఇస్మార్ట్ (Double Ismart) సమయంలోనే ఇలాంటి పని చేసి ఉంటే కథ బాగా వచ్చేది. ఇక మేకింగ్ పరంగా పూరి జగన్నాధ్ ఈ సినిమాని చాలా అద్భుతంగా తెరకెక్కిస్తాడు. కాబట్టి కథ క్లారిటీగా ఉంటే ఎలాంటి ఇబ్బంది ఉండకుండా సినిమా సాఫీగా సాగుతుందనే ఉద్దేశ్యంతో అతని అభిమానులైతే ఉన్నారు.
మరి ఎట్టకేలకు పూరి జగన్నాధ్ ఇప్పుడు ఒక మంచి డిసీజన్ తీసుకున్నాడు అంటూ అతని అభిమానులు సోషల్ మీడియాలో విపరీతమైన కామెంట్స్ అయితే చేస్తున్నారు. చూడాలి మరి బెగ్గర్ సినిమా ఎలా ఉండబోతుంది పూరి జగన్నాథ్ ఈ సినిమాతో మరోసారి ఫామ్ లోకి వస్తాడా లేదా అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…