డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర పూరీ జగన్నాధ్ పూరీ మ్యూజింగ్స్ అంటూ తన వాయిస్ ఓవర్‌తో ఎన్నో విషయాలను ఆడియోల రూపంలో విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఏదో ఒక టాపిక్ తీసుకుని దానిపై తనకున్న అభిప్రాయం ఏమిటో చాలా విపులంగా చెబుతున్న పూరి తాజాగా ఔత్సాహిక రైటర్స్ కు టిప్స్ అందిస్తున్నాడు. లాక్ డౌన్ టైమ్ లో సినీ ప్రేక్షకులు మారిపోయారని.. ఇకపై ఏది రాసినా గ్లోబల్ ను దృష్టిలో పెట్టుకొని రాయమని కొత్త రైటర్స్ కు పూరి కొని సలహాలు ఇచ్చాడు. వాటిల్లో కొన్ని ముఖ్యమైన వాటిని Also Read:
Also Read: బిగ్ బాస్ 4: ఈవారం ఎలిమినేట్ అయ్యేది ఆమెనా..?
లోకల్ కంటెంట్ బాగుంటే లాంగ్వేజ్ తో సంబంధం లేదు. రీజనల్ ను దృష్టిలో పెట్టుకొని సినిమా తీయకూడదు. ప్రపంచం మొత్తం నా సినిమా చూస్తోంది అనుకొని సినిమా తీయాలి. అలాగే మాస్ సినిమా తీసినా, కోటి రూపాయలతో చిన్న సినిమా తీసినా గ్లోబల్ మొత్తం నా సినిమా చూస్తుందనే స్పృహ రచయితకి దర్శకుడికి ఉండాలి. ఎందుకంటే కథ చెప్పాల్సిన నటులు, ప్రొడ్యూసర్లు రోజూ హాలీవుడ్ కంటెంట్ చూస్తున్నారు. పబ్లిక్ కూడా అంతే. కథలు రాసేవాళ్లు కూడా ఆ రేంజ్ లో ఉండాలి. లేకపోతే మనం అవుట్ డేటెడ్ అయిపోతాం. మన కథలు పాత కంపు కొడతాయి.
Also Read:మూవీ రివ్యూ: ‘అనగనగా ఓ అతిథి’.. హిట్టా? ఫ్లాపా?
అదే కంటెంట్ బాగుంటే.. సబ్ టైటిల్స్ లేకపోయినా కొరియన్ సినిమా చూస్తున్నారు. నిజం మాట్లాడుకుంటే సి-సెంటర్ జనాలు కూడా చైనా సినిమాలు చూస్తున్నారు. మనమే బి-సెంటర్, సి-సెంటర్ కథలంటూ ఆలోచిస్తున్నాం. ఇకనైనా మనం ఆలోచిద్దాం.. అందుకే లాక్ డౌన్ కు ముందు రాసుకున్న స్క్రిప్టులు ఏమైనా ఉంటే చించేయండి. మనసు ఒప్పుకోకపోతే అదే పాయింట్ ను మళ్లీ ఫ్రెష్ గా రాయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే వేల కోట్లు ఖర్చుపెట్టడానికి ఎన్నో ఓటీటీలు రెడీగా ఉన్నాయి. అలాంటప్పుడు రైటర్స్ నిద్రపోతే ఎలా ? ఇండస్ట్రీ కూడా నిద్రపోతుంది. అందుకే నువ్వు రైటర్ వైతే రిలాక్స్ అవ్వకు. దయచేసి సంవత్సరాల తరబడి స్క్రిప్టులు రాయొద్దు అంటూ పూరి కొత్త వాళ్లకు విలువైన సలహాలు ఇచ్చాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Puri jagannadh lessons for new writers
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com