దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గ్రోత్ రేటు కూడా తగ్గుతుండడంతో ప్రజల్లో కొంత మేర ఉపశమనం కలుగుతోంది. ఈ నేపథ్యంలో కరోనా కేసులు రోజుకు రెండున్నర లక్షల స్థాయికి చేరింది. మే నెలాఖరు వరకు కేసుల సంఖ్య ఇంకా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. కరోనా గ్రోత్ రేటు తగ్గడంతో రోజువారీ కేసులు సైతం తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశంలో37 లక్షల యాక్టివ్ కేసుల సంఖ్య గత వారం రోజుల్లోనే ఏడు లక్షల వరకు తగ్గిపో యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 29 లక్షల వరకు ఉంది.
సెకండ్ వేవ్ లో మహారాష్ర్ట, ఢిల్లీ, కర్ణాటక రాష్ర్టాల్లో కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుతున్నాయి. రాబోయే నెల రోజుల్లో సెకండ్ వేవ్ నుంచి దేశం ఉపశమనం కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనా కేసుల సంఖ్య తగ్గినా కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలపై వ్యాక్సినేషన్ ప్రక్రియ ఒత్తిడి పతాక స్థాయికి తీసుకెళ్లనుంది. ఇప్పటికే డోస్ వేయించుకున్న వారు రెండో డోస్ కోసం ఎదురుచూస్తున్నారు.
వ్యాక్సినేషన్ కోసం ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. సెకండ్ వేవ్ దేశంలోని గ్రామాలకు పాకింది. దీంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. వ్యాక్సిన్ వేసుకుంటేనే కరోనాను జయించే వీలుంటుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ ఎప్పుడు వేస్తారని ఎదురు చూస్తున్నారు. మూడో వేవ్ పై ప్రజల్లో భయాందోళనలు పెరుగుతున్నాయి. కరోనా నుంచి బయటపడడానికి టీకా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఇప్పటికే 20 లక్షల డోసుల స్థాయిలోనే వ్యాక్సినేషన్ కొనసాగుతుండగా దేశం మొత్తం వ్యాక్సినేషన్ వేయడానికి కనీసం రెండేళ్ల సమయం పడుతుందని విశ్వసిస్తున్నారు.
ఈ ఏడాది డిసెంబర్ నాటికి రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నా ప్రజల్లో విశ్వాసం లేకుండా పోతోంది. అందుకు కట్టుబడకపోతే బీజేపీ ప్రభుత్వం ప్రతిష్ట దిగజారడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ వేయడంపై దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఏర్పడింది. దీనికి అధికారులు సైతం సహకరించాలి. అప్పుడే టీకా పంపిణీ కార్యక్రమం పూర్తవుతుంది.