Puri Jagannadh: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు వరుస సినిమాలతో మంచి విజయాలను అందుకున్న పూరీ జగన్నాథ్ ప్రస్తుతం తన ఫామ్ ను కోల్పోయి డిజాస్టర్లను అందుకుంటున్నాడు.ఇక అందులో భాగంగానే రామ్ హీరోగా ఇస్మార్ట్ శంకర్ సినిమాకి సిగ్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా సూపర్ సక్సెస్ అవుతుందనే ధీమాని పూరి జగన్నాథ్ తెలియజేస్తున్నప్పటికీ కొద్ది రోజులుగా పూరి జగన్నాధ్ అంత ఫామ్ కి అయితే లేడు మరి ఈ సినిమాని ఎంత మేరకు సక్సెస్ చేస్తాడు అనేది కూడా ఇప్పుడు చాలా మందిలో చర్చనియంశం గా మారింది.
అయితే చాలా రోజుల తర్వాత ఇస్మార్ట్ శంకర్ తో మంచి విజయాన్ని అందుకున్న పూరి జగన్నాథ్ ఆ తర్వాత వచ్చిన లైగర్ సినిమాతో భారీ డిజాస్టర్ ని మూట కట్టుకున్నాడు. ఇక ఇప్పుడు పూరి తీస్తున్న సినిమా కనక ప్రేక్షకులను మెప్పిస్తే పర్లేదు కానీ లేకపోతే మాత్రం పూరి ఫేడ్ అవుట్ అవ్వాల్సిన సమయం వచ్చినట్టే అని ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా అనుకుంటున్నాడు.
ఎందుకంటే ఇప్పటికి ఆయన చాలా సినిమాలు చేస్తూన్నాడు కానీ అందులో కొన్ని మాత్రమే విజయాలను సాధిస్తున్నాయి.ఒక హీరో క్యారెక్టరైజేషన్ కి తగ్గట్టుగా సినిమా తీయడం లో పూరి జగన్నాథ్ ఎప్పుడు ముందుంటాడు. కానీ సినిమాల సక్సెస్ లో ఇప్పుడు ఎందుకో కొద్దిగా వెనకబాటు తనన్ని చూపిస్తున్నాడు అంటు మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.
నిజానికి పూరి జగన్నాథ్ చాలా మంచి డైరెక్టర్ అయినప్పటికీ ఆయన ఈరోజు ఇలా ప్లాప్ సినిమాలు తీయడం అనేది చాలా బాధాకరమైన విషయం అనే చెప్పాలి. ప్రస్తుతం పూరి జగన్నాధ్ డూ ఆర్ డై పొజిషన్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ సినిమా మీదనే ఆయన భవిష్యత్తు అనేది ఆధారపడి ఉంది. ప్రస్తుతానికి ఆయనకి స్టార్ హీరోలు ఎవరు డేట్స్ ఇవ్వడం లేదు అనే విషయం తెలుస్తుంది.
ఒకసారి ఈ సినిమాతో కనక మంచి విజయాన్ని సాధిస్తే మరోసారి స్టార్ హీరోలు అందరు కూడా తనతో సినిమాలు చేయడానికి ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది అంటు పలువురు సినీ ప్రముఖులు కూడా పూరి జగన్నాథ్ పైన మంచి అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు…ఇక పూరి కెరియర్ స్టార్టింగ్ లో చేసిన ఇడియట్, అమ్మానాన్న ఓ తమిళమ్మాయి,పోకిరి లాంటి సూపర్ డూపర్ హిట్ ని అందించాడు కాబట్టి పూరి ఆల్వేస్ పూరినే అనేది మరోసారి నిరూపించుకుంటాడు…