Puri Jagannadh : గత కొన్ని సంవత్సరాల క్రితం పూరి జగన్నాథ్ సినిమా కోసం ప్రేక్షకులందరూ ఆసక్తికి ఎదురుచూసేవారు. ఆయన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుందని తప్పకుండా ఆ ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తాయని నమ్మేవారు. కానీ రెండు మూడు సంవత్సరాల నుంచి ఆయనకు సరైన సక్సెస్ అయితే రావడం లేదు. వరుసగా డిజాస్టర్ సినిమాలను తీస్తూ ఇండస్ట్రీ నుంచి ఫెయిడ్ ఔట్ దశకు చాలా దగ్గరగా ఉన్నాడనే చెప్పాలి. మరి ఏది ఏమైనా కూడా గత సంవత్సరం రిలీజ్ అయిన డబుల్ ఇస్మార్ట్ (Double Ismart) సినిమా భారీ డిజాస్టర్ ని మూటగట్టుకుంది. ఇక ఆ సినిమా తర్వాత పూరి జగన్నాథ్ ఇప్పుడప్పుడే సినిమాలు చేయడు అని అందరు అనుకున్నారు. కానీ విజయ్ సేతుపతి (Vijay Sethupathi) లాంటి నటుడితో ‘బెగ్గర్’ (Beggar) అనే ఒక టైటిల్ ను ఫిక్స్ చేసి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో సినిమా చేయబోతున్నారనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఇక విజయ్ సేతుపతి సైతం ఆ విషయంలో క్లారిటీ ఇవ్వడంతో పూరి జగన్నాధ్ విజయ్ సేతుపతి సినిమా ఫిక్స్ అయింది. ఇక వీళ్ళ కాంబోలో చేస్తున్న సినిమా ఎలా ఉండబోతుంది అనే దాని మీదనే ఇప్పుడు సర్వత్ర ఆసక్తి అయితే నెలకొంది.
Also Read : పూరీ,ఛార్మి చేతుల్లో మరో హీరో బలి..? ఫోటోకే వణికిపోతున్న ఫ్యాన్స్!
ఇక ఇందులో టబు (Tabu), నివేదిత థామస్ (Nivedhitha Thamas) లాంటి నటులు కూడా నటిస్తూ ఉండడం విశేషం. ఇక వీళ్లతో పాటుగా బాలీవుడ్ స్టార్ హీరో అయిన అక్షయ్ కుమార్ (Akshay Kumar) కూడా ఇందులో ఒక కీలకపాత్ర లలో నటించబోతున్నాడు అనే వార్తలయితే వినిపిస్తున్నాయి.
ఇక ఇప్పటికే అక్షయ్ కుమార్ చేసిన వరుస సినిమాలు డిజాస్టర్ బాట పడుతున్న నేపథ్యంలో తెలుగు దర్శకుడితో సినిమా చేయాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నారు. ఇక ప్రస్తుతం పూరి జగన్నాథ్ సినిమాలో ఒక కీలకపాత్ర ఉండడంతో అక్షయ్ కుమార్ ఆ పాత్ర చేయడానికి తను సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. ఇక దానికి తోడుగా విజయ్ సేతుపతి కూడా ఈ సినిమాలో ఉండటం వల్ల అక్షయ్ కుమార్ ఈ సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.
మరి ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటి పూరి జగన్నాథ్ ఇప్పటి వరకు చేసిన సినిమాల స్టైల్ ను పక్కన పెట్టి కొత్త స్టైల్లో ఈ సినిమా చేయబోతున్నాడా? విజయ్ సేతుపతిని కథతో ఒప్పించడం అంటే అంత ఆషామాషీ వ్యవహారం అయితే కాదు. మరి పూరి జగన్నాథ్ ఏం చెప్పి అతన్ని ఒప్పించాడు. అసలు ఈ సినిమా ఎలా ఉండబోతుంది? అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
Also Read : పూరి జగన్నాధ్ విజయ్ సేతుపతి కాంబోలో రానున్న సినిమా స్టోరీ ఇదేనా..?