Puneeth Rajkumar: అతను పెద్ద ఇంట్లో పుట్టాడు. పుడుతూనే యువరాజుగా పేరు తెచ్చుకున్నాడు. కర్ణాటకలో అతని కుటుంబమే గొప్ప కుటుంబం. కానీ, అతను మాత్రం సాధారణ వ్యక్తిగానే బతికాడు. అయినా.. చిన్నతనం నుంచీ అతన్ని పెద్ద ఇంటి కొడుకు అనే పిలిచే వాళ్ళు. ఎందుకంటే అతని కుటుంబం అంటే, అక్కడి ప్రజలకు అంత మర్యాద ఉంది.

ఇక అతని నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. కేవలం ఆరు నెలల వయసులో ‘ప్రేమద కాణికె’ అనే చిత్రంలో నటించి మహా మహా నటులనే ఆకట్టుకున్నాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా పాన్ ఇండియా స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు. అందుకే పది సంవత్సరాల వయస్సులోనే ఏకంగా జాతీయ అవార్డును అందుకున్నాడు. అతనే కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్.
పునీత్ స్టార్స్ కే స్టార్, కానీ ఆ స్టార్ డమ్ ఎన్నడూ చూపించలేదు. ఎందుకంటే పునీత్ ఎంతో వినయపూర్వకమైన వ్యక్తి. పైగా సామాజిక సేవకు ప్రసిద్ధి. మైసూర్‌లోని 26 అనాథాశ్రమాలు, 45 ఉచిత పాఠశాలలు, 16 వృద్ధాశ్రమాలు, 19 గోశాలలు మరియు మైసూరులో శక్తి ధామా అని సంఘంలో అనాథ బాలికల సంరక్షణ కోసం సహాయం చేశాడు.
Also Read: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కు దక్కిన అరుదైన గౌరవం…
పైగా అనేక ప్రభుత్వ కార్యక్రమాలకు కర్ణాటకలో ఉచితంగా పునీత్ బ్రాండ్ అంబాసిడర్‌గా పని చేసాడు. ఇక తను గొప్ప సింగర్. ఎన్నో గొప్ప పాటలు పాడాడు. కానీ ఏ నాడు పాడటానికి డబ్బు తీసుకోలేదు, ఒకవేళ నిర్మాతలు డబ్బులు ఇస్తే.. వెంటనే ఆ డబ్బు సామాజిక సేవ కోసం ఇచ్చేసే వాడు. మన దురదృష్టవశాత్తు పునీత్ చిన్న వయస్సులోనే మరణించి ఉండొచ్చు.
Also Read: తాను చనిపోయినా సేవ ఆగకూడదని పునీత్ ఏం చేశాడో తెలిస్తే..
కానీ, మరణానంతరం తన కళ్లను దానం చేసి, తన సేవను అలాగే కొనసాగేలా తగిన ఏర్పాట్లు చేసి.. ఎప్పటికీ జీవించే ఉన్నాడు. ఒక గొప్ప నటుడు మరణించిన తర్వాత, ప్రజలు అతని నటన కంటే కూడా, అతని గొప్పతనం, అతని సామాజిక సేవ గురించి మాట్లాడుతున్నారు అంటే.. అది ఒక్క పునీత్ కే సాధ్యం అయింది. ఇది కదా సాధకం అంటే. ఏది ఏమైనా యువరాజులా వచ్చాడు, మహారాజులా వెళ్ళిపోయాడు.