Puneeth Rajkumar: ఎంతకాలం బతికామన్నది కాదు.. ఎలా బతికామన్నది ముఖ్యం అనుకుంటే.. పునీత్ రాజ్ కుమార్ బతికిన విధానానికి ‘మనిషి జన్మ’ సంతోషంతో ఎగిరి గంతేస్తోంది. 45 స్కూళ్లు.. 26 అనాథశ్రమాలు, 16 ఓల్డ్ ఏజ్ హోమ్స్.. 19 గోశాలలకు సాయం.. చివరకు చనిపోయినా రెండు కళ్లూ దానం చేసిన మహోన్నతమైన వ్యక్తి పునీత్ రాజ్ కుమార్. హీరోలు నిజ జీవితంలో హీరోలు కాదు, కానీ పునీత్ రాజ్ కుమార్.. నిజ జీవితంలోనూ హీరోనే.

అయితే, పునీత్ రాజ్ కుమార్ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే సాంగ్ లిరిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఏ సినిమాలోది ఈ సాంగ్ అంటే.. ‘రాజకుమార’ సినిమా టైటిల్ సాంగ్ లిరిక్స్ ఇవి. మరి ఈ లిరిక్స్ ఎలా ఉన్నాయో.. మీరు చూడండి.
‘గుడిసెలో ఉన్నా.. బంగళాలో ఉన్నా.. అతనెప్పుడూ ఒకేలా ఉంటాడు. దాని చుట్టూనే ఆడుకుంటాడు.
చిన్న అయినా.. పెద్ద అయినా.. అందరినీ గౌరవిస్తాడు. ఉన్నతంగా జీవిస్తాడు.
ఉన్నతుడు కానీ గర్వం చూపించడు
మధురమైన పాత జ్ఞాపకాలతో గడిపేస్తుంటాడు..’
ఈ పాటలోని పదాలు పునీత్ రాజ్ కుమార్ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పునీత్ చాలా పెద్ద ఇంట్లో పుట్టాడు. పుడుతూనే యువరాజుగా పేరు తెచ్చుకున్నాడు. కర్ణాటకలో అతని కుటుంబమే గొప్ప కుటుంబం. కానీ, అతను మాత్రం సాధారణ వ్యక్తిగానే బతికాడు. పైగా కేవలం ఆరు నెలల వయసులో ‘ప్రేమద కాణికె’ అనే చిత్రంలో నటించి మహా మహా నటులనే ఆకట్టుకున్నాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా పాన్ ఇండియా స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు. అందుకే పది సంవత్సరాల వయస్సులోనే ఏకంగా జాతీయ అవార్డును అందుకున్నాడు.

ఆ తర్వాత కన్నడ పవర్ స్టార్ అయ్యాడు. పునీత్ స్టార్స్ కే స్టార్, కానీ ఆ స్టార్ డమ్ ఎన్నడూ చూపించలేదు. పునీత్ ఎంతో వినయపూర్వకమైన వ్యక్తి. పైగా సామాజిక సేవకు ప్రసిద్ధి. ఏది ఏమైనా పునీత్ యువరాజులా వచ్చాడు, మహారాజులా వెళ్ళిపోయాడు.