Bhavadeeyudu Bhagat Singh: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ‘భవదీయుడు భగత్ సింగ్’ మూవీ గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో ఒక పవర్ ఫుల్ పాత్ర ఉందట. అయితే, ఆ పాత్రలో ‘మీర్జాపూర్’ వెబ్ సిరీస్ ఫేమ్ పంకజ్ త్రిపాఠీ నటించబోతున్నాడు. ‘మీర్జాపూర్’ సిరీస్ ఒక బూతు సిరీస్. తెలుగు వెర్షన్ లోనూ స్ట్రీమ్ అయిన ఈ వెబ్ సిరీస్ బాగానే హిట్ అయ్యింది.

ఇక ఈ సిరీస్ లో పంకజ్ త్రిపాఠీ తన నటనతో బాగా ఆకట్టుకున్నాడు. మంచి పేరు తెచ్చుకున్నాడు. అందుకే.. ఈ నటుడికి పవన్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. నిజానికి గతంలో మంచు విష్ణు హీరోగా నటించిన ‘దూసుకెళ్తా’ సినిమాలో పంకజ్ త్రిపాఠీ విలన్ గా నటించారు. అంటే.. పవర్ స్టార్ సినిమా అతనికి తెలుగులో రెండో సినిమా.
ఇక ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే హరీష్ శంకర్ రాసిన కథలో పవన్ పై ఓ ప్లాష్ బ్యాక్ రాశాడని, ఆ ప్లాష్ బ్యాక్ లో పవన్ పక్కా సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తాడని తెలుస్తోంది. అయితే, ఆ ప్లాష్ బ్యాక్ లో ఆ సిన్సియర్ పోలీస్ ను ప్రజలే తమ స్వార్థంతో బలి చేస్తారు.
దాంతో ఆ పోలీస్ కొడుకు ‘యంగ్ పవన్’ ప్రజల పై ఎలా పగ తీర్చుకున్నాడు ? చివరకు ప్రజల్లో ఎలాంటి మార్పులు తీసుకొచ్చాడు ? అనేది మెయిన్ కథ అట. మొత్తానికి ఈ కథ పవన్ రాజకీయాలకు బాగా పనికొచ్చేలా ఉంది. ఇక తండ్రి పాత్రలోనూ.. అలాగే లైవ్ లో వచ్చే కొడుకు పాత్రలోనూ పవనే నటించబోతున్నాడు.

నిజానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి కొన్ని కథలు బాగా సెట్ అవుతాయి. మెయిన్ గా సమాజం పై పోరాడే వీరుని పాత్ర పవన్ కి పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. అందుకే, హరీష్ శంకర్ తెలివిగా పవన్ తో చేయబోతున్న సినిమాలో సమాజ సేవకు సంబంధించిన అదనపు హంగులు అన్నీ పెట్టుకున్నాడు.
అలాగే తన కథకి మంచి కమర్షియల్ అంశాలు కూడా బాగా అద్దాడు. మరి హరీష్ ఈ సినిమాతో పవన్ పూర్వ మాస్ వైభవాన్ని తెలుగు తెరకు మరోసారి ఘనంగా చాటి చెప్పగలడా ? చూడాలి.
[…] Jayalalitha Shoban Babu Daughter: తమిళనాడు మాజీ సీఎం, దివంగత జయలలిత, శోభన్ బాబుల గురించి ఇప్పటికీ ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంటుంది. గతంలో చాలామంది జయలలిత అసలు వారసులం తామే అంటూ రచ్చరచ్చ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు ఇదే కోవలో మరో మహిళ తెరమీదకు వచ్చింది. తానే జయలలిత, శోభన్ బాబు వారసురాలిని అంటూ మీడియాకు ఎక్కింది. […]