Nandamuri Balakrishna: ‘బాలయ్య బాబు’ అరవై ఏళ్ల వయసులో కూడా సినిమాల వేగం మాత్రం తగ్గించడం లేదు. దీనికి తోడు, ఈ మధ్య బాలయ్య క్రేజ్ డబుల్ అయింది. ఒకప్పుడు స్టార్ డైరెక్టర్లు అంతా బాలయ్యతో సినిమా అనగానే మొహం చాటేసేవాళ్ళు. ఇప్పుడు బాలయ్య డేట్లు కోసం పడిగాపులు కాస్తున్నారు. బాలయ్యతో సినిమాలు చేయాలని బడా నిర్మాతలు సైతం క్యూ కడుతున్నారు.

ప్రస్తుతం ఫిక్స్ అయిన బాలయ్య సినిమాల లిస్ట్ చూస్తే మతిపోతుంది. భారీ కాంబినేషన్స్ లో బాలయ్య సినిమాలు చేస్తున్నాడు. ఇంతకీ ఆ కాంబినేషన్స్ ఏమిటో చూద్దాం. ప్రస్తుతం నట సింహం గోపీచంద్ మలినేనితో తన 107వ సినిమాని భారీ స్థాయిలో చేస్తున్నాడు. ఈ సినిమా కథ మొత్తం రాయలసీమ – కర్ణాటక బోర్డర్ నేపథ్యంలో జరుగుతుందని.. కథలో రాయలసీమకు చెందిన ఓ సామాజిక అంశాన్ని కూడా ప్రముఖంగా ప్రస్తావించ బోతున్నారని తెలుస్తోంది.
Also Read: ‘ఆర్ఆర్ఆర్’ 3డీలో.. సరికొత్త అనుభూతి ఇది !
ఈ సినిమా తర్వాత టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి బాలయ్య బాబుతో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూర్తి ఎంటర్‌టైనర్ గా కాకుండా, సీరియస్ యాక్షన్ డ్రామాగానే తీయాలని అనిల్ ప్లాన్ చేస్తున్నాడు. తనదైన మార్క్ టైమింగ్ తో, తన మార్క్ డైలాగ్ లతో, వరుస విజయాలను అందుకుంటున్న ఈ టాలెంటెడ్ డైరెక్టర్ కి ఫుల్ డిమాండ్ ఉంది. బాలయ్యతో సినిమా అంటే ఈ సినిమా పై భారీ అంచనాలు ఉంటాయి.
ఇక అనిల్ రావిపూడితో సినిమా తర్వాత.. బాలయ్య, డేర్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కి డేట్లు ఇచ్చాడు. పూరితో చేయబోయే సినిమా వెరీ పవర్ ఫుల్ గా ఉంటుందని.. బాలయ్య ఆ మధ్య ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు. ఈ సినిమా వచ్చే ఏడాది చివరి నుంచి మొదలు కానుంది.

ఈ సినిమా తర్వాత, నిర్మాత దిల్ రాజు, బాలయ్య హీరోగా ఒక సినిమా చేయడానికి ప్రస్తుతం కసరత్తులు చేస్తున్నాడు. ఇప్పటికే డైరెక్టర్ ‘శ్రీకాంత్ అడ్డాల’తో చర్చలు జరుపుతున్నాడు. దాదాపు ఈ కలయికలో సినిమా ఫిక్స్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అలాగే బాలయ్యతో సినిమా చేయాలని మైత్రీ మూవీస్, ఎకె ఎంటర్ టైన్ మెంట్స్, మరియు నిర్మాత సి. కళ్యాణ్ ప్లాన్ చేస్తున్నాయి. వీటికి కూడా స్టార్ డైరెక్టర్లే ఉంటారట.
Also Read: ఆర్ఆర్ఆర్’ సినిమా కోసం రంగంలోకి ముఖ్యమంత్రి.. ఇండియాలోనే ఇదో సంచలనం..