
Puneeth Rajkumar: కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణం తీరని లోటు. ఆయన అభిమానులను శోకసంద్రంలో ముంచి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. ఆయన మరణ వార్తను విన్న అభిమానులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కొందరు చనిపోయిన జీవించే ఉంటారు. అది వారు చేసే మంచి పనులు బట్టి ఉంటుంది. మనం చేసే పనులే మనం పోయాక కూడా మనలోని మనిషిని గుర్తిస్తాయి. తాజాగా పునీత్ రాజ్ కుమార్ కూడా తన మరణం తరువాత కూడా ఆయన చేసిన పనులతో అందరిలో ఇంకా కనిపిస్తూనే ఉన్నారు.
ఆయన పార్థివ దేహాన్ని అభిమానులు చూడటానికి క్యూ కట్టారు. ఆయనలోని మంచితనంతో మనుషులను ఆకట్టుకోవడమే కాకుండా జంతువులను సైతం ప్రేమించాడు. కుక్కలను చేరదీసి వాటి ఆలనా పాలనా చూశాడు. దీంతో వాటితో ఆయనకు ఎంతో అభిమానం ఏర్పడింది. అవి ఆయన కనిపించకపోతే దిక్కులు చూడటంతో ఆయన కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు.
రాజ్ కుమార్(Puneeth Rajkumar) కుక్కల ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో కూడా షేర్ చేస్తుండేవాడు. వాటితో ఎక్కువ కాలం గడిపేవాడు. దీంతో వాటితో ఆయనకు అవినాభావ సంబంధం ఏర్పడింది. రెండు పెంపుడు కుక్కలు పునీత్ కనిపించకపోయే సరికి తిండి తినడం లేదు. పైగా బాధతో కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. పెంపుడు కుక్కల తీరుతో కుటుంబ సభ్యులు సైతం కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
కుక్కలు పునీత్ ఫొటో వద్దకు వెళ్తూ చూస్తుండటంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆయన సమాధి వద్దకు వాటిని తీసుకెళ్లినా అవి ఏం ముట్టకుండా దీనంగా చూస్తుంటే కుటుంబ సభ్యులు కంటి నిండా నీరు కారుస్తున్నారు. కుక్కలకు సైతం పునీత్ పై ఎంత అభిమానం ఉందో చూస్తుంటే వారి కన్నీరు ఆగడం లేదు.
Also Read: తెలుగు లోనూ విడుదల కానున్న పునీత్ రాజ్ కుమార్ “జేమ్స్” చిత్రం…