Puneet Kumar Superstar: బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా ఒక కంటెస్టెంట్ కి ఎంత మంచి పాపులారిటీ, క్రేజ్ వస్తుందో..అదే రేంజ్ హౌస్ లోపల అతను చేసే పనులను బట్టి నెగటివిటీ కూడా వస్తుంది. అయితే కొంత కాలానికి ఆ కంటెస్టెంట్స్ ని మర్చిపోతారు ఆడియన్స్. మన తెలుగు బిగ్ బాస్ కి 8 సీజన్స్ పూర్తి అయ్యాయి. ఈ 8 సీజన్స్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న కంటెస్టెంట్స్ సినీ ఇండస్ట్రీ లో ఉన్నత స్థాయిలో స్థిరపడిన వాళ్ళని మనం చాలా తక్కువ చూసి ఉంటాము. కేవలం ఒకరిద్దరు మాత్రమే బుల్లితెర మీద సక్సెస్ అయ్యారు కానీ, వెండితెర లో ఒక వెలుగు వెలగాలి అనే కల మాత్రం కలగానే మిగిలిపోయింది. కేవలం రోహిణి , హరితేజ వంటి కంటెస్టెంట్స్ మాత్రమే వెండితెర మీద కూడా సక్సెస్ అయ్యారు. అయితే బిగ్ బాస్ ద్వారా ఒక రేంజ్ లో పాపులారిటీ ని సంపాదించుకొని, బయటకి వచ్చిన తర్వాత ఆడియన్స్ చేత చితక్కొట్టించుకుంటున్న కంటెస్టెంట్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాము.
ఆ కంటెస్టెంట్ పేరు పునీత్ సూపర్ స్టార్, అలియాస్ ప్రకాష్ కుమార్. ఇతను మన తెలుగు బిగ్ బాస్ కంటెస్టెంట్ కాదు కానీ, హిందీ బిగ్ బాస్ ఓటీటీ రెండవ సీజన్ లో ఒక కంటెస్టెంట్ గా అడుగుపెట్టాడు. ఇతగాడు హౌస్ లోకి అడుగుపెట్టిన అతి కొద్ది గంటల్లోనే ఎలిమినేట్ అయ్యి బయటకి వచ్చేసాడు. ఇతను ప్రవర్తించిన తీరు పట్ల హౌస్ మేట్స్ మొత్తం అసహనం వ్యక్తం చేసారు. ఇతని ప్రవర్తన ని వాళ్ళు కనీసం 24 గంటలు కూడా తట్టుకోలేకపోయారు. హౌస్ మేట్స్ పై చెప్పుకోలేని భాషతో తిట్టడం, టూత్ పేస్ట్ ని తన ముఖం పై రాసుకోవడం, డిటర్జెంట్ ని తన పై తానే వేసుకోవడం, బిగ్ బాస్ ని తనని బయటకి పంపమని బెదిరించడం ఇలా ఒక్కటా రెండా ఎన్నో రకాలుగా అందరిని ఇబ్బంది పెట్టాడు.
ఇదంతా గమనించిన బిగ్ బాస్, హౌస్ మేట్స్ ఓటింగ్ తో ఇతన్ని బయటకి గెంటేశారు. బయటకి వచ్చిన తర్వాత కూడా ఇతను వేసిన కొన్ని వేషాలకు జనాలతో దెబ్బలు తిన్నాడు. తనకి ఇంస్టాగ్రామ్ లో మంచి రీచ్ ఉండడం తో పలు బ్రాండ్స్ కి సంబంధించిన వాళ్ళు, తమ ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేయాల్సిందిగా డబ్బులు ఇచ్చారు. డబ్బులు తీసుకున్న తర్వాత పునీత్ వాళ్ళని మోసం చేయడంతో, ఇతను ఉంటున్న చోటకి వచ్చి చితకబాది వెళ్లారు. ఇది ఇలా ఉండగా రీసెంట్ గానే ఈయన ఫ్లైట్ దిగి వెళ్తుండగా ఎవరో ఒకరు వచ్చి ఇతన్ని ఇరగకుమ్మి వెళ్లారు. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఇలా ఎదో ఒక తుంటరి పని చేసి జనాలతో కొట్టించుకుంటూనే ఉంటాడు ఈ పునీత్ సూపర్ స్టార్.
Bigg boss fame Puneet Superstar got Beaten up by a Random guy while deporting from Plane.#puneetsuperstar #beaten #commonman #RTV pic.twitter.com/6QSSY2dJgy
— RTV (@RTVnewsnetwork) December 18, 2024