https://oktelugu.com/

South Korea: ఆ దేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న దోమలు.. పట్టుకునే ప్రయత్నంలో ట్రాకింగ్‌ పరికరాలు..!

దోమ సైజు చూస్తే చాలా చిన్నగానే ఉంటుంది. కానీ, అవి కుడితే కలిగే నష్టం చాలా ఎక్కువ. కొన్నిసార్లు ప్రాణాలు కూడా పోతాయి. అంత భయకరంగా ఉంటుంది. అందుకే ప్రభుత్వాలు కూడా దోమల నివారణకు చర్యలు చేపడుతాయి. ప్రజలు కూడా జాగ్రత్తలు తీసుకుంటారు.

Written By:
  • Raj Shekar
  • , Updated On : December 19, 2024 / 04:13 PM IST

    South Korea

    Follow us on

    South Korea: దోమల కారణంగా ఏటా ప్రపంచ వ్యాప్తంగా వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కోట్ల మంది ఆస్పత్రుల పాలవుతున్నారు. దోమల కారణంగా ఏటా వైద్యానికి వందల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. కరోనా కంటే ఎక్కువగా దోమల కారణంగానే ఏటా ప్రజలు మరణిస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి. దోమలు చిన్నగా ఉన్నా.. అవి చేసే నష్టం భారీగా ఉంటుంది. తాజాగా మలేరియా దోమలు రెండు దేశాలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఉత్తర, దక్షిణ కొరియాలు మలేరియా దోమలతో ఇబ్బంది పడుతున్నాయి. దోమల నివారణకు అవి ఏటా కొత్త విధానం అనుసరిస్తున్నాయి. అయినా నివారణ మాత్రం దోమలు మాత్రం తగ్గడం లేదు. తాజాగా ట్రాకింగ్‌ పరికరాలు ఏర్పాటు చేశాయి. ఇవి మనుషుల కోసం కాదు. కేవలం దోమలను పట్టుకోవడానికే. ఉత్తర, దక్షిణ కొరియా సరిహద్దులో భారీగా భద్రత ఉంటుంది. ఈ సరిహద్దు దగ్గర దక్షిణ కొరియా 76 ట్రాకింగ్‌ పరికరాలు ఏర్పాటు చేసింది. ఈ పరికరాలు క్షిపణులు, సైనికుల కోసం కాదు. కేవలం మలేరియా దోమలను పట్టుకోవడానికే. ఇది వింతగా అనిపించవచ్చు. కానీ, దానికి బలమైన కారణం ఉంది.

    మలేరియా వ్యాప్తి..
    దక్షిణ కొరియాలో దోమల కారణంగా మలేరియా వ్యాపిస్తోంది. ఈ వ్యాధి ఆదేశ ప్రజలకు ప్రధాన సవాల్‌గా మారింది. ఏఎఫ్‌పీ ఏజెన్సీ నివేదిక ప్రకారం ఈ సమస్యకు పొరుగున ఉన్న శత్రు దేశమైన ఉత్తర కొరియా అని తేల్చింది. ఉత్తర కొరియాలో మలేరియా కేసులు భారీగా ఉన్నాయి. ఈ క్రమంలో అక్కడ దోమల నిర్మూలన సాధ్యం కాకపోగా, దోమలు ఇప్పుడు దక్షిణ కొరియాలోకి ప్రవేశించాయి. మలేరియా వ్యాప్తి చేస్తున్నాయి.

    వాతావరణ మార్పులతో..
    దక్షిణ కొరియాలో ఈ ఏడాది మలేరియా వ్యాధిపై జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. వాతావరణ మార్పుల కారణంగా ముఖ్యంగా భారీ వర్షాలతో దోమలు వృద్ధి చెందుతున్నాయి. దీంతో దోమల నివారణకు స్వీయ చర్యలు చేపట్టాలని శాస్త్రవేత్తలు, వైద్యులు సూచిస్తున్నారు. డీడబ్ల్యూ హిందీ నివేదిక ప్రకారం.. ఈమస్యపై ఉత్తర, దక్షిణ కొరియా కలిసి చేయలేకపోతే పరిస్థితి మరింత దిగజారుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. 1993లో దక్షిణ కొరియా మలేరియా సైనికుడికి మలేరియా సోకింది. అప్పటి నుంచి వ్యాధి కొనసాగుతోంది. అంతకు ముందు మలేరియా రహిత దేశంగా ఉంది. 2023లో కేసులు దాదాపు 80 శాతం పెరిగాయి. 2022లో 420 నుంచి 747కి పెరిగాయి.

    12 కిలో మీటర్లు కవర్‌ చేస్తాయి..
    రెండు దేశాల మధ్య అసలు సమస్య డిమిలిటరైజ్డ్‌ జోన్‌ అంటే ఈకో. ఇది నాలుగు కిలోమీటర్ల వెడల్పు, జనావాసాలు లేని భూభాగం. ఇది 250 కిలో మీటర్ల పొడవైన సరిహద్దు వెంట ఉంది. ఈ సైనిక రహిత జోన్‌ ప్రాంతం దట్టమైన అడవులతో ఉంది. ఈ భూమి మానవ నివాసానికి యోగ్యం కావు. ఈ సరిహద్దు ప్రాంతం కొరియా యుద్ధ విరమణ తర్వాత 1953లో ఏర్పాటు చేసింది. ఇది ల్యాండ్‌మైన్‌ నిండిన ప్రాంతం. దోమలు వృద్ధి చెందడానికి ఉత్తమమైన వాతావరణం కల్పిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇవి 12 కిలోమీటర్ల దూరం వరకు వ్యాపించి ఉన్నాయి. గత దశాబ్దంలో దక్షిణ కొరియాలో దాదాపు 90 శాతం మంది మలేరియా రోగలు ఈ ఈకో సమీపంలోని ప్రాంతాల్లోనివారే.