Prithvi: సుమ హోస్ట్ గా ఈటీవీ ఛానల్ లో ప్రసారమవుతున్న క్యాష్ షో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా క్యాష్ ప్రోమో విడుదల కాగా రోహిత్, పృథ్వీ, ప్రేమ, వెంకట్ ఈ షోలో పాల్గొని సందడి చేశారు. రోహిత్ ఈ షోలోకి దేవుడు వరమందిస్తే పాటతో ఎంట్రీ ఇవ్వగా రుక్కు రుక్కు రుక్మిణి పాటతో పృథ్వీ, నీ నవ్వే నాగస్వరమే పాటతో ప్రేమ, ఏనాడు వాడని వరమా సాంగ్ తో వెంకట్ ఎంట్రీ ఇచ్చారు.
సుమ రోహిత్ ను మీరు వెంకట్ గారితో వర్క్ చేశారా అని అడగగా తాను వెంకట్ తో చేయలేదని రోహిత్ చెప్పగా అయినప్పటికీ మేము ఫ్రెండ్స్ అని వెంకట్ చెప్పారు. సుమ కలిసి సినిమాలు చేయకపోవడం వల్ల ఫ్రెండ్స్ అయ్యారంటారా? అని కామెంట్ చేశారు. ప్రేమ కూరగాయలు కట్ చేసే సమయంలో వేలు తెగితే ప్రేమించే భర్తగా మీ రియాక్షన్ ఏమిటని సుమ వెంకట్ ను అడగగా వెంకట్ ప్రేమ వేలిని నోట్లో పెట్టుకుంటారు.
సుమ పృథ్వీతో నేను ప్రశ్న అడుగుతానని మీరు ఆన్సర్ చెప్పకూడదు అనుకుంటే స్టోన్ ను క్రష్ చేయాలని చెబుతారు. వెంకట్ పృథ్వీ ఛాతీపై స్టోన్ ను పెట్టుకుని క్రష్ చేయగలడని చెప్పగా సుమ నేను చూడలేను బాబోయ్ అని చెబుతుంది. నాగార్జున, వెంకటేష్ లలో ఎవరికి సపోర్టింగ్ యాక్టర్ గా చేసినందుకు హ్యాపీగా ఫీలవుతున్నారని సుమ అడగగా నాగార్జున అని నేను నాగ్ సార్ ని లవ్ చేస్తున్నానని పృథ్వీ చెప్పారు.
ఆ తర్వాత చిరంజీవి చిన్నప్పటి నుంచి తన ఫ్యాన్ అంటూ సుమ కామెడీ చేశారు. సుమ వరస్ట్ మెమొరీ ఏమిటని అడగగా పృథ్వీ నాకు అందమైన బాబు పుట్టాడని ఆ సమయంలో చాలా హ్యాపీగా ఉన్నానని లైఫ్ సూపర్ గా ఉందని ఆ సమయంలో బాబు ఆటిజంతో బాధ పడుతున్నాడని తెలిసి డిప్రెషన్ లోకి వెళ్లానని పృథ్వీ చెప్పుకొచ్చారు. క్యాష్ షోలో పృథ్వీ ఎమోషనల్ అయ్యారు.
Recommended Videos: