Mangam Peta Karimnagar: ఎవరో వస్తారని ఏదో చేస్తారి ఎదురు చూసి మోసపోకుమా అన్నారో సినీకవి. ఇది అక్షరాల వారికి వర్తిస్తుంది. తాము అనుకున్న లక్ష్యం కోసం అందరు ఒకటై శ్రమిస్తున్నారు. శ్రమదానంతో గుట్టను సైతం చదును చేస్తున్నారు. ముంపు గ్రామమైనా కంపును ఎదుర్కొనే దిశగా చర్యలు చేపట్టారు. అందరితో శభాష్ అనిపించుకుంటున్నారు. ప్రభుత్వం ఇచ్చే పరిహారం కోసం ఆశపడలేదు. చేతుల్లో సత్తువ ఉంది. కష్టపడే తత్వం ఉందని నిరూపిస్తున్నారు. పదిమందికి ఆధర్శంగా నిలుస్తున్నారు.

గంగాధర మండలం మంగపేట గ్రామస్తుల బాధలు వర్ణనాతీతం. ఒకపక్క ముంపు బాధ. మరోవైపు రహదారి లేక అవస్థలు పడుతున్న వారికి ఓ గుట్ట అవకాశంగా కనిపించింది. కాళేశ్వరం నీటితో ఊళ్లోని ఎల్లమ్మ చెరువును ఏడాదికి రెండు దఫాలుగా నింపుతున్నారు. దీంతో బ్యాక్ వాటర్ ఊళ్లోని కొన్ని ఇళ్లు, వ్యవసాయ భూములను ముంపునకు గురిచేస్తోంది. దీంతో వారు తమకు నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరినా స్పందించలేదు. దీంతో ఏం చేయాలనే ఆలోచనలో పడ్డారు.
Also Read: Prithvi: కన్న కొడుకుకు అలా జరగడంతో డిప్రెషన్ లోకి వెళ్లా.. పృథ్వీ కామెంట్స్ వైరల్!
ఊరికి సమీపంలోనే ఓ 30 ఎకరాల స్థలంలో ఓ గుట్ట ఉంది. ఇంకేముంది దాన్ని చదును చేసుకునే పనిలో పడిపోయారు. ఇంటికింత వేసుకుని దాదాపు రూ. 60 లక్షలు జమ చేసుకుని గుట్టపైనే ఇళ్లు నిర్మించుకోవాలని ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటికే కొందరు ఇళ్లు నిర్మించుకోగా ఇంకొందరు కట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. గ్రామస్తుల తెగువకు అందరు ఫిదా అవుతున్నారు. తలుచుకుంటే కొండనైనా పిండి చేయగలరని నిరూపిస్తున్నారు.
ఇక కొండ మీద ఇల్లు నిర్మించుకుంటే విషపురుగుల భయం ఉండదు. బ్యాక్ వాటర్ సమస్య కూడా ఉండదు. అందుకే గ్రామస్తులు తమ ఆశలకు అనుగుణంగా కొండను చదును చేసి సొంతంగా ఇళ్లు కట్టుకుంటున్నారు. ప్రభుత్వంపై ఆశపడకుండా తమ దారి తాము చూసుకుంటున్నారు. దీంతో మంగపేట గ్రామస్తులా మజాకా అనే విధంగా చేస్తున్నారు. వారి ఐకమత్యానికి అందరు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Also Read:YCP- Congress: కాంగ్రెస్‌తో పొత్తుపై తేల్చేసిన వైసీపీ..