https://oktelugu.com/

అయ్యో.. లెజండరీ దర్శకుడికి అవమానం !

డైరెక్టర్ అనే పదానికి స్టార్ డమ్ తెచ్చిన మొట్టమొదటి ‘దిగ్దర్శకుడు’ ఆయన, దర్శకరత్న అనే పదానికి పర్యాయ పదం ఆయన. ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించి.. రచయితగా, నిర్మాతగా, దర్శకుడిగా సంచలన విజయాలు సాధించి దర్శకుల విలువను పెంచిన ఆ దిగ్దర్శకుడు ‘డా. దాసరి నారాయణరావు’. ఆయన కుమారులు నేడు చేసుకుంటున్న ఆరోపణలను చూస్తుంటే కచ్చితంగా ఆ మహానుభావుడికి ఈ బాగోతం అంతా అవమానం లాగే అనిపిస్తోంది. కేసీఆర్ టార్గెట్ గా.. రాష్ట్రానికి కేంద్ర బృందం […]

Written By: , Updated On : June 27, 2020 / 05:47 PM IST
Follow us on


డైరెక్టర్ అనే పదానికి స్టార్ డమ్ తెచ్చిన మొట్టమొదటి ‘దిగ్దర్శకుడు’ ఆయన, దర్శకరత్న అనే పదానికి పర్యాయ పదం ఆయన. ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించి.. రచయితగా, నిర్మాతగా, దర్శకుడిగా సంచలన విజయాలు సాధించి దర్శకుల విలువను పెంచిన ఆ దిగ్దర్శకుడు ‘డా. దాసరి నారాయణరావు’. ఆయన కుమారులు నేడు చేసుకుంటున్న ఆరోపణలను చూస్తుంటే కచ్చితంగా ఆ మహానుభావుడికి ఈ బాగోతం అంతా అవమానం లాగే అనిపిస్తోంది.

కేసీఆర్ టార్గెట్ గా.. రాష్ట్రానికి కేంద్ర బృందం రానుందా?

అత్యధిక చిత్రాల చేసి దర్శకుడుగా గిన్నిస్‌ పుటలకెక్కిన ఆ గొప్పవ్యక్తి.. మరణించిన తర్వాత కూడా అందరి హృదయాల్లో జీవించి ఉన్న ఆ గొప్ప వ్యక్తికి ఇది కచ్చితంగా అవమానమే. ప్రతి సంక్షోభంలోనూ సినీ కార్మికుల పక్షాన నిలిచి వారిని ఆదుకొని వాళ్ల హృదయాల్లో సజీవంగా నిలిచిపోయిన దాసరిని.. నేడు టీవీల్లో ఆయన విజువల్స్ మీద ఆయన కుమారుల వివాదాన్ని చూపిస్తూ ఉంటే ఆ దిగ్దర్శకుడి ఆత్మ ఎంత బాధ పడుతుంది.

గులాబీ కోటలో ఇక అన్ని కొత్త పుష్పాలే?

కానీ ఇప్పటివరకూ సినీ పెద్దలలో ఈ వివాదం గురించి ఇంకా స్పందించలేదు. ఎంతోమందికి జీవితాలను ఇచ్చిన దాసరి కుటుంబం రోడ్డున పడకముందే సినీ పెద్దలు ఈ సమస్యను పరిష్కరించాలి. కానీ అది సాధ్యమేనా ? దాసరి మరణించిన సమయంలోనే కొంతమంది పెద్దలు ఆయన భౌతిక కాయాన్ని చూడటానికి కూడా రాలేదని ఓ విమర్శ ఉంది. ఏది ఏమైనా దాసరి భౌతికంగా దూరమయినా ఆయన తీసిన అజరామ సినిమాలు అపురూపం. ఆయన కుమారుల సమస్య త్వరగా తీరిపోవాలని కోరుకుందాం.