వైసీపీ నేతలు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విచిత్రమైన కామెంట్స్ చేస్తున్నారు. కాపు నేస్తం పథకంపై పవన్ కళ్యాణ్ దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శిస్తున్నారు. సీఎం జగన్ అంటే పవన్ కళ్యాణ్ కు నచ్చదని… అందుకే ఆయనపై విమర్శలు చేస్తున్నారని కన్నబాబు వ్యాఖ్యానించారు. చంద్రబాబు పట్ల ప్రేమను పవన్ దాచుకోలేకపోతున్నారని విమర్శించారు.
ఇదిలా ఉండగా.. పవన్ పై గత విమర్శలను ఇప్పటి విమర్శలను గమనిస్తే… జగన్ ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలపై పవన్ స్పందించిన ప్రతిసారి వైసీపీ నేతలు చంద్రబాబు పేరును ప్రస్తావిస్తూ.. పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేయడం గమనార్హం. అదే సమయంలో ఆయనపై వ్యక్తిగత విమర్శలు కూడా చేస్తుంటారు. పవన్ అడిగిన కొన్ని ప్రశ్నలకు వైసీపీ నేతలు ఖచ్చితమైన సమాధానం లేక ఇలాంటి విమర్శలు చేస్తున్నారా.. అనిపిస్తుంది.
ఇటీవల “కాపు నేస్తం” పై జగన్ మాట్లాడుతూ ఏడాదికి 2వేల కోట్లు కాపుల అభివృద్ధికి కేటాయిస్తామని చెప్పారు. అంతేకాకుండా 13 నెలల వ్యవధిలోనే 23లక్షలమంది కాపులకు 4,770కోట్లు ఇచ్చామని ప్రకటించారు. ఈ విషయంపై పవన్ కళ్యాణ్ స్పందిస్తూ.. 2వేల కోట్లు ఇస్తామని చెప్పిన మీరు “ఏడాది తిరిగేలోగా దానికి రెట్టింపు కంటే ఎక్కువ ఎలా ఇస్తారనేది పవన్ ప్రశ్న..?” అలా చేస్తే “కాపు రిజర్వేషన్ అంశం పక్కకు పోతుందని పవన్ అడుగుతున్నారు?” ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా.. చంద్రబాబు ప్రస్తావన తీసుకొచ్చి తప్పించుకుపోవడం వైసీపీ నేతలకు పెద్ద ఫ్యాషన్ అయింది. అదే సమయంలో సొంత డబ్బా కొట్టుకోవడం ఎక్కువైంది. తమ ప్రభుత్వం తీసుకొచ్చిన కాపు నేస్తం అద్భుతమైన పథకమని, కాపుల కోసం ఏడాదిలో రూ.4,770 కోట్లు ఖర్చు చేస్తున్నామని కన్నబాబు అంటున్నారు. రిజర్వేషన్ అంశం పక్కకు పోతుందని పవన్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఎందుకు చెప్పడంలేదో వైసీపీ నేతలకే తెలియాలి.