Project K Prabhas Look: యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటిస్తున్న సినిమాలలో భారీ అంచనాలను ఏర్పాటు చేసుకున్న చిత్రం ‘ప్రాజెక్ట్ K’. ‘ఆది పురుష్’ లాంటి డిజాస్టర్ ఫ్లాప్ తర్వాత ప్రభాస్ నుండి రాబోతున్న సినిమా ఇది. ఈ సినిమాలో ప్రభాస్ తో పాటుగా అమితాబ్ బచ్చన్, దీపిక పడుకొనే, దిశా పఠాని తో పాటుగా తమిళ సూపర్ స్టార్ కమల్ హాసన్ కూడా నటిస్తున్నాడు.
ఈ చిత్రానికి సంబందించిన ఫస్ట్ లుక్ కాసేపటి క్రితమే విడుదల చేసారు. ఇందులో ప్రభాస్ సూపర్ హీరో నటిస్తున్నాడు అని ఇది వరకే మేకర్స్ ప్రకటించారు. లుక్స్ అభిమానులు ఎలా అయితే ఊహించుకున్నారో, అదే రేంజ్ లో ఉన్నాయి. హాలీవుడ్ లో మార్వల్ కామిక్ బుక్స్ లో ‘తోర్ ‘ క్యారక్టర్ ని పోలిన విధంగా ప్రభాస్ లుక్ ఇందులో ఉంది.
రేపు ఈ సినిమాకి సంబందించిన గ్లిమ్స్ వీడియో ని విడుదల చెయ్యబోతున్నారు. అమెరికా లోని ‘సాన్ డియోగో’ లో ఈ గ్లిమ్స్ విడుదల చెయ్యబోతున్నారు. ఈ ఈవెంట్ కి ప్రభాస్ తో పాటు గా కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపిక పడుకొనే మరియు మూవీ యూనిట్ మొత్తం పాల్గొనబోతుంది.
ఈ గ్లిమ్స్ వీడియో లో మూవీ లో అందరి నటినటుల లుక్స్ తెలియనున్నాయి. అంతే కాకుండా అసలు ప్రాజెక్ట్ k అంటే ఏమిటి అనే అంశాన్ని హైలైట్ చేస్తూ ఈ టీజర్ ఉండబోతుంది అట. ఇప్పటికే సలార్ టీజర్ లో ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ ని ఈ గ్లిమ్స్ వీడియో ఎలా అలరిస్తుందో చూడాలి.
The Hero rises. From now, the Game changes
This is Rebel Star #Prabhas from #ProjectK.
First Glimpse on July 20 (USA) & July 21 (INDIA).
To know #WhatisProjectK stay tuned and subscribe: https://t.co/AEDNZ3ni5Q@SrBachchan @ikamalhaasan @deepikapadukone @nagashwin7… pic.twitter.com/oRxVhWq4Yn
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 19, 2023
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read MoreWeb Title: Project k movie prabhas first look released
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com