https://oktelugu.com/

Pushpa 2: పుష్ప 2 బాలీవుడ్ రైట్స్ కోసం పోటీ పడుతున్న ప్రొడ్యూసర్స్…

సినిమా అనేది రంగుల ప్రపంచం ప్రతి ఒక్కరు ఇక్కడ సక్సెస్ సాధించి చాలా ఉన్నతమైన పొజిషన్ కి వెళ్లాలని కోరుకుంటారు. కానీ ఇక్కడ కొందరు మాత్రమే సక్సెస్ అవుతారు. మిగిలిన వాళ్ళందరూ ఏదో ఒక రకంగా తమ కెరియర్ ని ముందుకు లాగిస్తూ ఉంటారు...

Written By:
  • Gopi
  • , Updated On : October 4, 2024 / 05:45 PM IST

    Pushpa 2

    Follow us on

    Pushpa 2: తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు అల్లు అర్జున్…ఇక ‘పుష్ప’ సినిమాతో భారీ ప్రభంజనాన్ని క్రియేట్ చేసిన ఆయన బాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోగా కొనసాగుతున్నాడు. ఇక ఐకాన్ స్టార్ గా గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ప్రస్తుతం ఆయన సుకుమార్ తో పుష్ప సినిమాకి సీక్వెల్ గా ‘పుష్ప 2’ చేస్తున్నాడు. ఈ సినిమా కూడా భారీ అంచనాల మధ్య రిలీజ్ కి రెడీ అవుతుంది. డిసెంబర్ 6వ తేదీన ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సుకుమార్ శత విధాలుగా ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఆయన అనుకున్నట్టుగానే ఈ డేట్ కి సినిమా వస్తేనే సినిమా మీద బజ్ అయితే ఉంటుంది. మరోసారి ఈ సినిమాని కనక పోస్ట్ పోన్ చేసినట్లయితే ఇక ఈ సినిమా విషయంలో ఎవరికీ పెద్దగా అంచనాలు అయితే ఉండవు. కాబట్టి అనుకున్న డేట్ కి సినిమాని తీసుకురావడమే ఉత్తమమని మేకర్స్ భావిస్తున్నారు. ఇక మొత్తానికైతే ఈ సినిమా మీద బాలీవుడ్ లో మాత్రం భారీ అంచనాలైతే ఉన్నాయి. తెలుగులో కొంతవరకు ఈ సినిమా మీద అంచనాలు తగ్గినప్పటికీ బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ ఈ సినిమాని భారీ రేట్ కి కొనుగోలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

    కానీ పుష్ప 2 మేకర్స్ మాత్రం ఇంకా ఎక్కువ డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. మరి బాలీవుడ్ రైట్స్ విషయంలో ఎందుకు పుష్ప 2 టీం భారీ రేంజ్ లో వసూలు చేయాలని చూస్తుంది అంటే అక్కడి ప్రేక్షకులందరూ ఈ సినిమా కోసం చాలా ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. దాదాపు అక్కడే ఈ సినిమా రెండు వందల కోట్లకు పైన కలెక్షన్లు ఈజీగా వసూలు చేస్తుందని మేకర్స్ భారీ నమ్మకంతో ఉన్నారు.

    కాబట్టి అలాంటి సమయంలో భారీ మొత్తంలో డిమాండ్ చేయడంలో తప్పులేదు అంటూ పుష్ప 2 సినిమా ప్రొడ్యూసర్స్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది…ఇక పుష్ప మొదటి పార్ట్ తో ‘నేషనల్ అవార్డు’ ని అందుకున్న అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాతో మరోసారి నేషనల్ అవార్డు మీద కన్నేసినట్లు గా కూడా తెలుస్తుంది.

    చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాడు అనేది… ఇక ఈ సినిమా తర్వాత సుకుమార్ రామ్ చరణ్ తో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇక అల్లు అర్జున్ తన తదుపరి సినిమా ఎవరితో చేస్తున్నారనే విషయం మీద ఇంకా క్లారిటీ రానప్పటికీ సుకుమార్ మాత్రం ముందుగానే ప్రణాళిక ను రూపొందించి పెట్టుకుంటున్నాడు…