పెడితే పెట్టారు, ఈ సమావేశంలో నాని పై విమర్శలు ఎక్కు పెట్టారు. ఇక పై నాని సినిమాలకు కష్టాలు తప్పవు అని బెదిరింపులు కూడా చేశారు. ఇన్నీ చేసి చివరకు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కే సినిమాలను ఇస్తే మా పరిస్థితి దారుణం అవుతుంది.. అసలు థియేటర్ల మనుగడకే కష్టమవుతుందంటూ మళ్ళీ ఎమోషనల్ అవుతూ థియేటర్స్ అసోసియేషన్ సభ్యులు చెప్పుకొచ్చారు.
అయితే, ఓటీటీలో తమ సినిమాను రిలీజ్ చేయాలని ఒక హీరో ఇంట్రెస్ట్ చూపించినా, లేదా ఒక నిర్మాత ఆసక్తి చూపించినా అది వారి వ్యాపారానికి సంబంధించిన వ్యక్తిగత విషయం. కానీ, సభాముఖంగా నానితో పాటు ‘టక్ జగదీష్’ నిర్మాతను విమర్శించడం, వారి పై వ్యక్తిగతంగా విమర్శలు చేస్తూ బెదిరించడం మంచి పద్దతి కాదు. అందుకే ఈ సమావేశం పై తాజాగా ఏటీఎఫ్‌పీజీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
సరే, ఈ విమర్శలు, ఆగ్రహాలను పక్కన పెడితే… కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీసిన నిర్మాతకి ఆ సినిమాని బిజినెస్ చేసుకోవడం అనేది ప్రాథమికంగా ఉన్న హక్కు. అయినా థియేటర్స్ లోనే సినిమాను రిలీజ్ చేయాలి ? అనే రైట్ ఏ డిస్ట్రిబ్యూటర్ కి లేదు. కరోనా పరిస్థితుల దృష్ట్యా పెట్టిన పెట్టుబడిని రాబట్టుకోవాలంటే.. డబ్బులు ఇచ్చే ఓటీటీల దగ్గరకే పోవాలి.
అంతేకాని కలెక్షన్స్ రావట్లేదు అని తెలిసినా.. డిస్ట్రిబ్యూటర్స్ లాభాల కోసం సినిమాని థియేటర్స్ లో రిలీజ్ చేయాలని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ ? అందుకే ఏ నిర్మాత అయినా తనకు లాభం అనుకుంటే ఓటీటీ ప్లాట్ ఫామ్స్‌కు తన సినిమాని స్వేచ్ఛగా అమ్ముకోవచ్చు. అయినా ఇక్కడ ఇంకో విషయం కూడా ఆలోచించాలి. లాభం కోసం చేసే పనిలో విలువులు గురించి ఆలోచించడం ఎంతవరకు సమంజసం!!