Tollywood : స్టార్ హీరోల ఆటలు ఇక చెల్లవు, తగ్గాల్సిందే!

సినిమా విడుదలైన మూడు రోజుల్లో 50 శాతానికి పైగా బిజినెస్ రాబట్టాలి. లేదంటే ఆ మూవీకి నష్టాలు తప్పవు. అందుకే వందల్లో టికెట్స్ ధరలు ఉంటున్నాయి. ఈ సమస్యలన్నింటికీ ఒక్కటే మార్గం, హీరోలు పారితోషికాలు తగ్గించుకోవడం..

Written By: NARESH, Updated On : September 14, 2024 7:58 pm

Tollywood

Follow us on

Tollywood : ఒకటి రెండు హిట్లు పడగానే చిన్న హీరోలు కూడా కోట్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో నిర్మాతలు ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. కాల్షీట్స్ ఇస్తే చాలు స్టార్ హీరోలకు కోట్లు కుమ్మరిస్తాం అనే సాంప్రదాయం వదిలేయాలని నిర్ణయం తీసుకున్నారట. హీరో మార్కెట్ ఆధారంగా మాత్రమే పారితోషికం ఇవ్వాలని ఫిక్స్ అయ్యారట.

సినిమా అనేది అత్యంత రిస్క్ తో కూడుకున్న వ్యవహారం. ఇప్పటి వరకు పరిశ్రమకు వందల మంది నిర్మాతలు వచ్చారు. వారిలో సక్సెస్ అయ్యింది పదుల సంఖ్యలో మాత్రమే. పది హిట్ సినిమాలు తీస్తే వచ్చిన లాభాలు ఒక్క భారీ ప్లాప్ తో పోవచ్చు. ఒక అంచనా ప్రకారం టాలీవుడ్ సక్సెస్ రేట్ రూ. 2-3 శాతం మాత్రమే. అంటే ప్రతి వంద చిత్రాలకు విజయం సాధించేవి రెండు లేక మూడు. తెలివైన నిర్మాతలు మాత్రమే పరిశ్రమలో నిలబడతారు.

చిత్ర నిర్మాణంలో నటుల పారితోషికాలకే అధిక భాగం చెల్లించాల్సి వస్తుంది. ముఖ్యంగా బడ్జెట్ లో సింహ భాగం హీరో రెమ్యూనరేషన్ కే ఖర్చు చేయాలి. నిర్మాతలకు హీరోల రెమ్యూనరేషన్ అత్యంత భారంగా తయారైంది. కల్కి చిత్ర బడ్జెట్ పరిశీలిస్తే… రూ. 500-600 కోట్ల మధ్య నిర్మించారు. అందులో నాలుగో వంతు రూ. 150 కోట్లు ఒక్క ప్రభాస్ కే చెల్లించారు. దీపికా పదుకొనే, కమల్ హాసన్, అమితాబ్ ఒక్కొక్కరు ఇరవై కోట్ల వరకు ఛార్జ్ చేశారు.

ఒకటి రెండు హిట్లు పడగానే చిన్న హీరోలు కూడా కోట్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో నిర్మాతలు ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. కాల్షీట్స్ ఇస్తే చాలు స్టార్ హీరోలకు కోట్లు కుమ్మరిస్తాం అనే సాంప్రదాయం వదిలేయాలని నిర్ణయం తీసుకున్నారట. హీరో మార్కెట్ ఆధారంగా మాత్రమే పారితోషికం ఇవ్వాలని ఫిక్స్ అయ్యారట.

వరుస ప్లాప్స్ లో ఉన్న ఓ స్టార్ హీరోని తన రెమ్యునరేషన్ 20 శాతానికి తగ్గించుకోవాలని ప్రస్తుత మూవీ నిర్మాత కోరాడట. అందుకు ఆ హీరో అంగీకరించాడని సమాచారం. అలాగే మరో హీరో ఓటీటీ మార్కెట్ బాగా పడిపోయిందట. డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ అతని సినిమాలు కొనేందుకు ముందుకు రావడం లేదట. దాంతో సదరు హీరో తన రెమ్యునరేషన్ తానే తగ్గించుకున్నాడట.

అంతెందుకు ప్రభాస్ ఆదిపురుష్ అనంతరం సైన్ చేసిన రాజా సాబ్ చిత్రానికి రెమ్యూనరేషన్ తక్కువే తీసుకున్నారట. బిజినెస్ లెక్కలు కూడా మారాయి. గతంలో మాదిరి ఓటీటీ సంస్థలు పోటీ పడి స్టార్ హీరోల సినిమాలు కొనడం లేదు. టీజర్, ట్రైలర్ చూసి నమ్మకం కలిగితే కొంచెం రేటు ఎక్కువ చెల్లించి కొనుగోలు చేస్తున్నాయి. నిర్మాతలు డిమాండ్ చేసినంత ఇవ్వడం లేదు. పే ఫర్ వ్యూస్ ఆధారంగా చెల్లించాలని కూడా నిర్ణయం తీసుకుంటున్నాయి.

ఈ క్రమంలో హీరోలు రెమ్యునరేషన్ తగ్గించుకుని నిర్మాతలకు మేలు చేయాలనే డిమాండ్ తెరపైకి వస్తుంది. టికెట్స్ ధరలు వందల్లో ఉండటానికి కూడా హీరోల రెమ్యూనేషన్ కారణం అవుతుంది. సినిమా విడుదలైన మూడు రోజుల్లో 50 శాతానికి పైగా బిజినెస్ రాబట్టాలి. లేదంటే ఆ మూవీకి నష్టాలు తప్పవు. అందుకే వందల్లో టికెట్స్ ధరలు ఉంటున్నాయి. ఈ సమస్యలన్నింటికీ ఒక్కటే మార్గం, హీరోలు పారితోషికాలు తగ్గించుకోవడం..