https://oktelugu.com/

NTR : చనిపోబోయే అభిమానితో వీడియో కాల్ మాట్లాడిన ఎన్టీఆర్.. హృదయాన్ని పిండేస్తున్న వీడియో!

గతం లో కూడా ఎన్టీఆర్ ఈ కౌశిక్ తో మాట్లాడాడు. కచ్చితంగా నిన్ను ఎదో ఒక రోజు కలుస్తాను, నీకు ఏమి కాదు, నువ్వు బాగుంటావు అని ధైర్యం చెప్పాడు. ఇక రీసెంట్ గా ఈ అబ్బాయి మాట్లాడిన మాటలను ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియా లో బాగా రీచ్ అయ్యేలా చేసారు.

Written By:
  • NARESH
  • , Updated On : September 14, 2024 / 08:23 PM IST

    NTR (1)

    Follow us on

    NTR : అభిమానులను తన సొంత మనుషులు లాగా భావించే హీరోలలో ఒకరు యంగ్ టైగర్ ఎన్టీఆర్. తన ప్రతీ సినిమా ఫంక్షన్ లో ఆయన అభిమానుల పట్ల చూపించే ప్రేమ చూస్తే ఏ హీరో అభిమానికి అయినా ముచ్చటేస్తుంది. అంతే కాదు అభిమానుల కోరిక తీర్చడం లో కూడా ఎన్టీఆర్ ఎప్పుడూ ముందు ఉంటాడు. వాళ్ళతో ఎన్టీఆర్ మాట్లాడే మాటలు వింటే మన ఇంట్లో వాళ్ళు మాట్లాడితే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. అలాంటి ఆప్యాయత ఆయన మాటల్లో కనిపిస్తుంది. ఇటీవలే కౌశిక్ అనే వీరాభిమాని క్యాన్సర్ చివరి స్టేజి లో బాధపడుతూ, నాకు ఎన్టీఆర్ అన్నయ్య ‘దేవర’ మూవీ విడుదలయ్యే వరకు అయినా బ్రతకాలని ఉంది, దయచేసి నాకు దేవర చిత్రాన్ని చూపించండి అంటూ ప్రాధేయపడుతూ మాట్లాడిన ఒక వీడియో ప్రతీ మనిషి హృదయాన్ని కలిచివేసింది.

    గతం లో కూడా ఎన్టీఆర్ ఈ కౌశిక్ తో మాట్లాడాడు. కచ్చితంగా నిన్ను ఎదో ఒక రోజు కలుస్తాను, నీకు ఏమి కాదు, నువ్వు బాగుంటావు అని ధైర్యం చెప్పాడు. ఇక రీసెంట్ గా ఈ అబ్బాయి మాట్లాడిన మాటలను ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియా లో బాగా రీచ్ అయ్యేలా చేసారు. ఈ వీడియో నేరుగా ఎన్టీఆర్ వరకు చేరింది. ఈరోజు ఆ కౌశిక్ తో ఎన్టీఆర్ మరో సారి ఆప్యాయంగా వీడియో కాల్ ద్వారా పలకరించాడు. ఆయన మాట్లాడుతూ ‘ ఏమాత్రం అధైర్య పడకు..నీకేమి కాదు, నువ్వు బాగుంటావు, నీకు ఏ సహాయం కావాలన్నా ఒక అన్నగా నీకు చేసి పెడతాను, నవ్వుతుంటే చాలా బాగున్నావు, ఇలాగే నవ్వుతూ ఉండాలి’ అంటూ మాట్లాడాడు ఎన్టీఆర్. అనంతరం కౌశిక్ తల్లి తో కూడా ఎన్టీఆర్ మాట్లాడాడు. అతని ఆరోగ్య పరిస్థితిని, అలాగే డాక్టర్లు ప్రస్తుతం అతని పరిస్థితి పై ఏమని మాట్లాడారో అడిగి వివరాలను తెలుసుకున్నాడు. ఆ తర్వాత తన టీం తో మాట్లాడి కౌశిక్ కి ఎలాంటి సహాయం కావాలన్నా చెయ్యాలని ఆదేశించాడు.

    ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది. ఎన్టీఆర్ అభిమాని పట్ల చూపించిన ప్రేమకు సర్వత్రా ప్రశంసల వర్షం కురిసింది. ఎన్టీఆర్ ని విమర్శించే వారు కూడా నేడు ఈ సంఘటన పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఈ నెల 27 వ తారీఖున ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ చిత్రం విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించిన ప్రొమోషన్స్ లో ఎన్టీఆర్ ఫుల్ బిజీ గా గడుపుతున్నాడు. ప్రస్తుతం ముంబై లో పలు ఇంటర్వ్యూస్ ఇచ్చిన ఆయన, త్వరలోనే అమెరికా ట్రిప్ కి వెళ్లనున్నాడు. మరోపక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సంబంధించిన ఏర్పాట్లను కూడా మేకర్స్ గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభం కానున్నాయి.