Homeఆంధ్రప్రదేశ్‌Araku Valley: అరకు అందాలకు అమెరికా రాయబారి ఫిదా!

Araku Valley: అరకు అందాలకు అమెరికా రాయబారి ఫిదా!

Araku Valley: తెలుగు రాష్ట్రాలు ప్రకృతి అందాలకు నెలవు. సహజసిద్ధమైన కొండలు, లోయలు, వాగులు వంకలు భారతీయులతోపాటు విదేశా యాత్రీకులను కూడా ఆకట్టుకుంటున్నాయి. తాజాగా అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి, ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు కనుమల్లో పర్యటించారు. అరకు అందాలకు ఫిదా అయ్యారు. విశాఖలోని కైలాసగిరి, ఆర్కే బీచ్‌తోపాటు అరకు పరిసరాల్లో పచ్చదనం, ప్రకృతి ఒడిలో అక్కడి ప్రజల జీవన విధానం చూసి ముగ్ధులయ్యారు. విశాఖ–అరకు మార్గంలో ప్రకృతి అందాలు, పచ్చదనం, నీటి ప్రవాహాలను చూసి పరవశించారు. పర్యావరణానికి దగ్గరగా, ఆరోగ్యకరమైన జీవనానికి చేరువగా ఉన్నట్లు యూఎస్‌ కాన్సులేట్‌ ప్రతినిధులు పేర్కొన్నారు.

కొనసాగుతున్న సైనిక విన్యాసాలు..
విశాఖ తీరంలో మార్చి 18 నుంచి భారత్‌–అమెరికా సైనిక సంయుక్త విన్యాసాలు కొనసాగుతున్నాయి. రెండు దేశాలకు చెందిన త్రివిధ దళాలు ఇందులో పాల్గొంటున్నాయి. ఈ ప్రదర్శనలో భారత్‌ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంలో రూపొందించిన ఐఎన్‌ఎస్‌ జలస్వ నౌకతోపాటు అమెరికాకు చెందిన యుద్ధ నౌకలపై త్రివిధ దళాలు విన్యాసాలు ప్రదర్శించారు.

విశాఖ తీరంలో బాహుబలి నౌక..
సైనిక విన్యాసాల్లో భాగంగా బాహుబలి నౌక కూడా విశాఖ తీరానికి చేరుకుంది. అమెరికా–భారత్‌ సౌనిక సిబ్బంది యూఎస్‌ కాన్సులేట్‌ ప్రతినిధులకు అవగాహన కల్పించారు. ఈ విన్యాసాల్లో ప్రపంచంలోనే అతిపెద్ద యుద్ధనౌకగా గుర్తింపు పొందిన సోమర్‌సెట్‌ 25 యుద్ధ ట్యాంకులు, నాలుగు హెలిక్యాప్టర్లు అనివైపులా ఆయుధ ట్యాంకులు, 1000 మంది సిబ్బంది నౌకలో ఉండడం విశేషం.

మార్చి 31 వరకు విన్యాసాలు..
2001, సెప్టెంబర్‌లో వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌పై ఉగ్రదాడల స్మారకంగా నిర్మించిన యుద్ధనౌకకు విపత్తుల సమయంలోనూ రక్షణ దళాలకు ఆస్పత్రిగా సేవలు అందిస్తుంది. టైగర్‌ ట్రయాంప్‌ పేరిట ఈనెల 31 వరకు సముద్రంపై విన్యాసాలు చేయనున్నాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Exit mobile version