https://oktelugu.com/

ఏపీ వాహనదారులకు అలెర్ట్: రూల్స్ అతిక్రమిస్తే భారీ జరిమానాలు

కేంద్రం ఆమోదించిన కొత్త మోటార్ వాహన చట్టాన్ని ఏపీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఈ చట్టం ప్రకారం వాహనదారుడు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే జేబు ఖాళీ అవ్వక మానదు. భారీ జరిమానాలు కట్టాల్సి ఉంటుంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు ఈ కొత్త చట్టాన్ని అమలు చేయగా.. తాజాగా ఆ జాబితాలోకి ఏపీ చేరింది. ఏపీ ప్రభుత్వం తాజాగా కొత్త మోటార్ చట్టం కింద ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై భారీగా జరిమానాలు పెంచుతూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.బైక్ […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : October 21, 2020 / 05:55 PM IST
    Follow us on

    కేంద్రం ఆమోదించిన కొత్త మోటార్ వాహన చట్టాన్ని ఏపీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఈ చట్టం ప్రకారం వాహనదారుడు ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే జేబు ఖాళీ అవ్వక మానదు. భారీ జరిమానాలు కట్టాల్సి ఉంటుంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు ఈ కొత్త చట్టాన్ని అమలు చేయగా.. తాజాగా ఆ జాబితాలోకి ఏపీ చేరింది. ఏపీ ప్రభుత్వం తాజాగా కొత్త మోటార్ చట్టం కింద ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై భారీగా జరిమానాలు పెంచుతూ కీలక ఉత్తర్వులు జారీ చేసింది.బైక్ నుంచి 7 సీట్ల కార్ల వరకు ఒకే విధమైన జరిమానాను విధించడం విశేషం. ఇక ఇతర వాహనాలకు అయితే ఇంకా వాచిపోయేలా భారీ జరిమానాలు విధించేందుకు జగన్ సర్కార్ సిద్ధమైంది. ట్రాఫిక్ ఉల్లంఘనలకు గరిష్టంగా రూ.10వేల వరకు జరిమానాను విధించారు.

    – వాహనం బరువు చెకింగ్ కోసం ఆపక పోయినా – రూ. 40000
    – రేసింగ్ మొదటిసారి రూ. 5000, రెండో సారి రూ. 10000
    – వేగంగా బండి నడిపితే – రూ. 1000
    – రూల్స్ కి వ్యతిరేకంగా వాహనాల్లో మార్పులు చేస్తే – రూ. 5000
    – సెల్ ఫోన్ డ్రైవింగ్, ప్రమాదకర డ్రైవింగ్ – రూ. 10000
    -పర్మిట్ లేని వాహనాలు వాడితే – రూ. 10000