Daggubati Abhiram: దగ్గుబాటి సురేష్ బాబు చిన్న కుమారుడు ‘దగ్గుబాటి అభిరామ్ కి హీరో కావాలని ఎప్పటి నుంచో బలమైన కోరిక ఉంది. తన బాబాయ్ వెంకీ సీనియర్ స్టార్ హీరో. ఇక తన అన్నయ్య రానా నేషనల్ రేంజ్ లో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అందుకే, తాను హీరో అయి తనకంటూ ఓ ప్రత్యేకతను తెచ్చుకోవాలని అభిరామ్ గత పదేళ్లుగా ఆశ పడుతున్నాడు. చేతిలో స్టూడియో ఉంది. నిత్యం చుట్టూ పదుల సంఖ్యలో దర్శకనిర్మాతలు ఉంటారు.

ఇక సాంకేతికంగా కూడా ఎవరికీ లేనంత సపోర్ట్ ఉంది. ఇంత ఉండి మరి పదేళ్ల నుంచి ఎదురుచూడటం ఎందుకు ? ఇక్కడే వ్యవహారం తేడా కొడుతోంది. అభిరామ్ కి దేనిలో అధికారం లేదు. అన్నీ పనులు చూసుకోవాలి. కానీ ఏ పనిని సొంతంగా చేసే స్వేచ్ఛ లేదు. స్టూడియోను మెయింటైన్ చేయాలి, కానీ స్టూడియోను ఎప్పుడు ఎలా వాడాలి అని అతను చెప్పలేడు.
Also Read: Gopichand Malineni- Balakrishna: రవితేజతో ప్లాన్, కానీ బాలయ్య ఆర్డర్స్.. డైరెక్టర్ పరిస్థితి ఏమిటి ?
ఇక ఎవరి చేత ఏ పని చేయించాలి ? లాంటి వాటిల్లో కూడా అభిరామ్ నిర్ణయించలేడు. అన్నిటికీ మించి అభిరామ్ సొంత నిర్ణయాలకు సురేష్ బాబు దగ్గర విలువ లేదు. అందుకే పదేళ్లు అవుతున్నా హీరో మాత్రం కాలేకపోయాడు అభిరామ్. అయితే, ఎన్నాళ్ల నుంచో దగ్గుబాటి అభిరామ్ కూడా హీరోగా లాంచ్ అవ్వబోతున్నాడు అంటూ అనేక రకాలుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.
కానీ ఆ లాంచింగ్ వ్యవహారం అనేది ఓ కొలిక్కి మాత్రం రావడం లేదు. ఇటు రానా గానీ, అటు సురేష్ బాబు గానీ, అభిరామ్ లాంచింగ్ ను ఎన్నడూ సీరియస్ గా తీసుకోలేదు. కాకపోతే అభిరామ్ బాధను చూడలేక ఆ మధ్య ఒక చిన్న సినిమాను చాలా సింపుల్ గా మొదలుపెట్టారు. అయితే, గత కొంత కాలంగా ఆ సినిమా సంగతి ఎవరికీ తెలియకుండా పోయింది.

అసలు ఆ సినిమా ఉందా ? లేదా ? అనేది కూడా క్లారిటీ లేదు. ఐతే, దర్శకుడు తేజ కూడా దగ్గుబాటి అభిరామ్ తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పై కూడా స్పష్టత లేదు. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు.. అన్నీ ఉన్నా అభిరామ్ కి కాలం కలిసి రావడం లేదు. ఐతే, చరణ్ రచ్చ సినిమా దర్శకుడు ‘సంపత్ నంది’.. అభిరామ్ కోసం ఒక కథ సిద్ధం చేశాడట. సురేష్ బాబుకి కథ నచ్చితే.. ఈ సినిమా సెట్ అయినట్టే.
Also Read:Chandini Chowdary: ఛాన్స్ ల కోసం చాందిని చౌదరి బరితెగింపు.. హాట్ స్టిల్స్ తో రచ్చ లేపుతుంది
[…] […]