Gopichand Malineni- Balakrishna: నట సింహం బాలయ్య – గోపీచంద్ మలినేని సినిమా కోసం నందమూరి బాలకృష్ణ అమెరికా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. సినిమాలో కొన్ని కీలకమైన యాక్షన్ సన్నివేశాలను అమెరికాలో షూట్ చేయాల్సి ఉంది. ఈ సినిమాలో మొత్తం ఏడు ఫైట్స్ ఉన్నాయి. ఒక్కో ఫైట్ రెండు నిమిషాల పాటు ఉంది. ఇక ఇంటర్వెల్ ఫైట్ అయితే, ఏకంగా ఐదు నిమిషాల పాటు ఉండనుంది. అసలు బాలయ్య సినిమా అంటేనే యాక్షన్.

రెండు గంటల ఇరవై నిమిషాల సినిమాలో బాలయ్య కనీసం నలబై నిమిషాలకు పైగా ఫైట్లు చేయడం ఆనవాయితీగా వస్తోంది. మరి ఈ రేంజ్ ఫైట్లు ఉంటే.. ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాకి ఎలా వస్తారు ? అనే భయం అక్కర్లేదు. ఎందుకంటే బాలయ్య నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఫైట్లే ఎక్స్ పర్ట్ చేస్తారు. ఇక ఇప్పటివరకు గోపీచంద్ తో తీసిన సినిమా రఫ్ ను బాలయ్య చూసుకున్నాడు.
Also Read: Ravi Teja: ఇటు మార్కెట్ పడిపోతుంది.. అటు రెమ్యునరేషన్ పెంచుతున్న రవితేజ
బాలయ్యకు అవుట్ ఫుట్ బాగా నచ్చింది. అందుకే, వెంటనే.. గోపీచంద్ మలినేనికి మరో సినిమా చేయాలని ఆర్డర్స్ పాస్ చేశాడు. కాకపోతే.. గోపీచంద్ మలినేని తన తర్వాత సినిమాను రవితేజతో ప్లాన్ చేస్తున్నాడు. ఆ సినిమా పై భారీ అంచనాలు ఉంటాయి. కాబట్టి.. ఆ సినిమా కోసం కనీసం సంవత్సరం అయినా పని చేయాల్సి ఉంటుంది.
ఈ నేపథ్యంలో గోపీచంద్ మలినేనికి బాలయ్యతో వెంటనే సినిమా చేసే పరిస్థితి ఉండదు. కానీ బాలయ్య మాత్రం సినిమా చేయాల్సిందే అంటున్నాడు. మరి ఇప్పుడు గోపీచంద్ మలినేని ఏమి చేస్తాడో చూడాలి. అయితే గోపీచంద్ మలినేనితో చేస్తోన్న సినిమా బాలయ్యకు బాగా నచ్చిందిలే గానీ, ఇంతకీ ఆ సినిమా ఫలితం ఎలా ఉంటుందో !

అయితే, మొదటి నుండి ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. పైగా ఈ సినిమా ఫస్ట్ లుక్ భారీ వ్యూస్ ను సాధించింది. ఒక విధంగా బాలయ్య కెరీర్ లోనే ఇది రికార్డు. మొత్తమ్మీద ఈ సినిమాకు బాగా డిమాండ్ ఉంది. మరి ఈ సినిమా హిట్ అవుతుందేమో చూడాలి.
Also Read:Chandini Chowdary: ఛాన్స్ ల కోసం చాందిని చౌదరి బరితెగింపు.. హాట్ స్టిల్స్ తో రచ్చ లేపుతుంది
[…] Also Read: Gopichand Malineni- Balakrishna: రవితేజతో ప్లాన్, కానీ బాల… […]
[…] Also Read: Gopichand Malineni- Balakrishna: రవితేజతో ప్లాన్, కానీ బాల… […]