Presidential Elections 2022 : రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాలు కకావికలం అవుతున్నాయి. పరువు పొగొట్టుకున్నాయని చెప్పొచ్చు. వాస్తవానికి రాష్ట్రపతి ఎన్నిక మొదలు కావడానికి.. నాన్ ఎన్డీఏకు.. ఎన్డీఏకు టఫ్ ఫైట్ ఉంటుందని అందరూ భావించారు. వ్యూహం లేకుండా ప్రతిపక్షాలు యశ్వంత్ సిన్హాను బరిలోకి దింపాయి. చరిష్మా గల నేత లేకపోవడం.. వ్యూహం లేకపోవడంతో వెనుకబడ్డాయి.

రాష్ట్రపతి ఎన్నికలు మొదలైనప్పుడు సరిసమానంగా ఉన్న ఎన్నికలు.. ఇప్పుడు ఎన్డీఏ వైపు పూర్తిగా మరలింది. ప్రతిపక్ష పార్టీలు ఒక్కొక్కటిగా జారిపోతున్నాయి. దీంతో మమతా బెనర్జీ నాలుక కరుచుకుంది. ద్రౌపది ముర్మును ప్రకటించకుంటే మేం ఆలోచించే వాళ్లమని మమతా బెనర్జీ అనడం ఓటమిని అంగీకరించినట్టే..
తొందరపడి ప్రతిపక్షాలు ముందే యశ్వంత్ సిన్హాను ప్రకటించడం పెద్ద తప్పు. ద్రౌపది ముర్మును ఎంపిక చేస్తారని బీజేపీ హింట్ ఇచ్చారు. కానీ గిరిజన నేతను ఎంపిక చేస్తారని ప్రతిపక్షాలు ఊహించలేదు. బెంగాల్ లో ముర్ము తెగ వారు పెద్ద సంఖ్యలో ఉండడంతో మమతా వెనకడుగు వేశారు.
ఇక ద్రౌపది ముర్మును అభ్యర్థిగా ప్రకటించగానే గిరిజన తెగ ఎక్కువగా ఉన్న జేఎంఎం సపోర్ట్ చేయడం ప్రతిపక్షాలకు పెద్ద షాక్. ఇక మహారాష్ట్రలో శివసేనను గద్దెదించినా కూడా ఆ పార్టీ బీజేపీ బలపరిచిన ద్రౌపది ముర్ముకు సపోర్టు చేయడం.. పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ కు గట్టి ఎదురుదెబ్బగా చెప్పొచ్చు. ఇవే కాదు.. ఒడిషాలో నవీన్ పట్నాయక్, కర్ణాటకలో దేవేగౌడ పార్టీలు కూడా ప్రతిపక్షంలో ఉన్నా యశ్వంత్ కు మద్దతు ఇవ్వలేదు. బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా ఇలానే షాకిచ్చింది.
రాష్ట్రపతి ఎన్నికల్లో పరువు పోగొట్టుకున్న ప్రతిపక్షాల తీరుపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.