Akhanda 2: బాలయ్య బాబు హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన చాలా సినిమాలు మంచి విజయాలను సాధించాయి. వీళ్ళ కాంబినేషన్ కి ఇండస్ట్రీ లో గొప్ప పేరైతే ఉంది. వీళ్ళిద్దరూ కలిసి చేసిన 3 సినిమాల్లో ఎమోషన్స్ తో పాటు, ఎలివేషన్స్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. అలాంటి వీళ్ళ కాంబినేషన్లో ‘అఖండ 2’ సినిమా వచ్చింది. ఈ సినిమా పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కింది. ఇక అఖండ మొదటి పార్ట్ భారీ విజయాన్ని సాధించడంతో దానికి సీక్వెల్ ను చేయాలని బాలయ్య – బోయపాటి అనుకున్నారు.
ఇక అదే రూట్ లో సనాతన ధర్మం హిందూ మతం ని బేస్ చేసుకొని ఈ సినిమాని తెరకెక్కించారు. దానికి సినిమాలో అంతా హై నిచ్చే కథ ఏమీ లేదు. కాబట్టి ఈ సినిమా ను తెలుగు సినిమా ఇండస్ట్రీకి మాత్రమే పరిమితం చేస్తే బాగుండేది. అలా కాకుండా సనాతన ధర్మం పేరుతో సినిమాని పాన్ ఇండియాకి టచ్ చేయాలని చూశారు. అక్కడే సినిమాకి చాలా వరకు దెబ్బ పడింది.
ఆ ఒక్కటి కనుక చేయకుండా కేవలం తెలుగు ఇండస్ట్రీకి మాత్రమే పరిమితం చేసి ఉంటే కథ పెద్దగా కన్ఫ్యూజన్స్ లేకుండా ఉండేది… సినిమాలో బాలయ్య బాబు హీరో అయినప్పటికి తనకంటే ప్రధాని పాత్రను చేసిన అతనికే స్క్రీన్ టైమ్ ఎక్కువగా ఉంటుంది. చాలా సీన్స్ లో డైలాగులు స్పీచ్ లు మాదిరిగా ఉండడం, సినిమాలో చూపించిన ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకోకపోవడం ఇవన్నీ ‘అఖండ 2’ కి భారీ మైనస్ గా మారాయి.
ముఖ్యంగా ఇండియాలో ఈ సినిమాని చేయాలనే ఆలోచన రావడమే ఒక పెద్ద మైనస్ అని, బోయపాటి సినిమాలు తెలుగు సినిమా ఇండస్ట్రీ వరకే పరిమితం అవుతాయి. ఆయన చేసే సినిమాలు మాస్ ప్రేక్షకులకు బాగా నచ్చుతాయి. బాలయ్య అలాంటి ఒక సినిమా చేస్తే బాగుండేది. అలా కాకుండా అఖండ 2 సినిమా వచ్చి ప్రేక్షకులను కొంతవరకు నిరాశపరిచిందనే చెప్పాలి…