Producer Ravi Shankar: పుష్ప ఊహకు మించిన విజయం సాధించింది. ముఖ్యంగా హిందీలో ఈ మూవీ రూ. 110 కోట్ల వసూళ్ల వరకు సాధించింది. పుష్ప చిత్రానికి అక్కడ దక్కిన ఓపెనింగ్స్ చూసిన ట్రేడ్ వర్గాలు డిజాస్టర్ అవ్వడం ఖాయం అన్నారు. ఫస్ట్ డే కేవలం రూ. 3 కోట్ల వసూళ్లు అందుకున్న పుష్ప మెల్లగా పుంజుకుంది. నెల రోజుల పాటు సాలిడ్ రన్ కొనసాగించిన పుష్ప వంద కోట్ల మ్యాజిక్ ఫిగర్ క్రాస్ చేసింది. వరల్డ్ వైడ్ పుష్ప దాదాపు రూ. 360 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టగా మూడో వంతు వసూళ్లు హిందీ బాక్సాఫీస్ నుండే రావడం విశేషం.

పుష్ప పార్ట్ వన్ బ్లాక్ బస్టర్ హిట్ నేపథ్యంలో పార్ట్ 2 భారీగా తెరకెక్కిస్తున్నారు. బడ్జెట్ రెట్టింపు చేయడంతో పాటు కథలో కూడా మార్పులు చేర్పులు చేశారట . ఈ క్రమంలో ఓ ఆసక్తికర వార్త ప్రచారంలోకి వచ్చింది. పుష్ప 2 లో హీరోయిన్ శ్రీవల్లి పాత్రను ట్రిమ్ చేశారట. రష్మిక మందాన చేసిన శ్రీవల్లి పాత్ర చనిపోతుందనే ప్రచారం జోరందుకుంది. ఈ క్రమంలో అచ్చు పుష్ప కెజిఎఫ్ 2 చిత్రాన్ని పోలి ఉందని. సుకుమార్ పార్ట్ 1, పార్ట్ 2 రెండూ కెజిఎఫ్ సిరీస్ స్ఫూర్తితో తెరకెక్కించారంటున్నారు. వరుస కథనాల నేపథ్యంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతల్లో ఒకరైన రవి శంకర్ స్పందించారు.
Also Read: Anasuya In Bigg Boss 6: బిగ్ బాస్ 6 లో అనసూయ..? ఎంత రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తుందో తెలుసా?
పుష్ప 2 లో రష్మిక చేస్తున్న శ్రీవల్లి పాత్ర చనిపోతుందని జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదు. అసలు కథ ఏమిటో మాకు కూడా పూర్తిగా అవగాహన లేదు. ఆ వార్తలు నాన్సెన్స్ అంటూ కొట్టిపారేశారు. అయితే రవిశంకర్ కామెంట్స్ స్పష్టత ఇవ్వకపోగా కన్ఫ్యూషన్ ఇంకా పెంచేశాయి. కారణం ఆయనకు కూడా స్క్రిప్ట్ తెలియదు అనడంతో పుష్ప2 లో శ్రీవల్లి చనిపోతుందనే వార్తలను కొట్టిపారేయలేం అంటున్నారు. కాబట్టి దీనిపై క్లారిటీ రావాలంటే పుష్ప 2 విడుదల కావాల్సిందే.

నిజానికి పుష్ప ఒక్క పార్ట్ గా మొదలెట్టారు. ప్రకటించినప్పుడు కూడా ఇది పాన్ ఇండియా చిత్రం కాదు. చిత్రీకరణ మొదలయ్యాక పుష్పను రెండు భాగాలుగా పాన్ ఇండియా చిత్రంగా ప్రకటించారు. పుష్ప పార్ట్ 2 లో కొంత భాగం చిత్రీకరణ కూడా పూర్తయినట్లు సమాచారం. ఇక ఇప్పటికే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది. పార్ట్ 2 గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్న సుకుమార్ ప్రీ ప్రొడక్షన్ కోసం చాలా సమయం తీసుకుంటున్నారు. పుష్ప 2 చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
Also Read: Naga Chaithanya Thankyou Movie: నాగచైతన్యకు ఆ అగ్ర నిర్మాత అన్యాయం?
[…] […]