Anchor Uday Bhanu: వ్యాఖ్యాతల్లో మొదటగా చెప్పుకునేది ఉదయభానునే. బుల్లితెరకు మొదటి యాంకర్ గా చేసింది ఉదయభానే అని తెలిసిందే. అంతటి ప్రాచుర్యం పొందిన ఉదయభాను తన ప్రస్థానాన్ని జనరంజకంగా కొనసాగించింది. స్పీడ్ లేని జెట్ లా దూసుకుపోయింది. తన నటనతో పాటు అందంతో మైమరపించింది. ఈ నేపథ్యంలో బుల్లితెరతో పాటు వెండితెర మీద కూడా తన ముద్ర వేసింది. హీరోయిన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా తన హవా నడిపించింది. దీంతో ఉదయభాను కొంత కాలం గ్యాప్ ఇచ్చి వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యం ఇచ్చింది. దీంతో కొంత కాలం దూరంగా ఉన్నా ప్రస్తుతం ప్రేక్షకులకు దగ్గరయ్యేందుకు పలు కార్యక్రమాల్లో పాల్గొంటోంది.

ఈటీవీలో ప్రసారమయ్యే గ్యాంగ్ లీడర్ షో లో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది. గతంలో యాంకర్ గా తన కెరీర్ ప్రారంబించిన ఉదయభాను తరువాత కాలంలో ఎందుకో దూరమైంది. మళ్లీ ఇప్పుడు తన ప్రస్థానాన్ని తిరిగి ప్రారంభించి పలు కార్యక్రమాల్లో కనిపిస్తోంది. ఈ మేరకు చోర్ బజార్ ప్రీరిలీజ్ ఈవెంట్ కు యాంకర్ గా వచ్చింది. దీంతో ఆమె ఇటీవల మెల్లమెల్లగా షోల్లో తన మాటలతో అదరగొడుతోంది. ఈ షో కు ముఖ్య అతిథిగా యంగ్ స్టార్ విశ్వక్ సేన్ హాజరయ్యారు.
Also Read: Producer Ravi Shankar: అదంతా నాన్సెన్స్ అంటూ ఫైర్ అయిన పుష్ప నిర్మాత
దీంతో ఉదయభాను ఆయనను స్టేజీపైకి ఆహ్వానించింది. ఆయన వస్తూనే ఉదయభానుపై పంచుల వర్షం కురిపించారు. దీనికి ఆమె చిన్నబోయింది. నిరాటంకంగా తన పంచులు విసురుతూనే ఉండటంతో ఏం చేయాలో ఆమెకు తోచలేదు. నేను చిన్నప్పటి నుంచి మిమ్మల్ని చూడాలనుకుంటున్నాను అని విశ్వక్ సేన్ చెబితే నేను కూడా చాలా రోజుల నుంచి మిమ్మల్ని కలవాలనుకుంటున్నా కుదరలేదని చెప్పగా మీరు చిన్నప్పుడు నేను ఇంకా పుట్టలేదని కౌంటర్ ఇవ్వడంతో అందరు నవ్వుకున్నారు.

మీకు నాకు నాలుదైదు ఏళ్లు తేడా ఉంటుంది అంతే అన్నా పెద్దగా రియాక్షన్ లేదు. దీంతో విశ్వక్ సేన్ ఉదయభానును తన పంచులతో ఆడుకున్న విషయాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఉదయభాను తన మాటలతో అందరిని మెప్పిస్తున్నా విశ్వక్ సేన్ మాత్రం ఆమెను ఆడుకోవడం సాధారణమే. కానీ ఇప్పుడు నెట్టింట్లో ట్రెండ్ అవుతోంది. ఉదయభాను విశ్వక్ సేన్ ల పంచులు అందరిలో ఆసక్తి రేపుతున్నాయి. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.
Also Read: Rajinikanth- Rakshit Shetty: సినిమా చూసి ఆ యంగ్ హీరోకి కాల్ చేసిన రజినీకాంత్!
[…] […]
[…] […]