https://oktelugu.com/

Rashmi Gautam: రష్మీని ఫిలిం ఛాంబర్ గేటుకు కట్టేసి కొడతానన్న నిర్మాత.. ఆ పని చేసిందట..

Rashmi Gautam: తెలుగు బుల్లితెర స్టార్ యాంకర్ గా దూసుకుపోతున్న రష్మీకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. జబర్దస్త్ షో ద్వారా వచ్చిన ఫేమ్ తో వెండితెరపై కూడా రాణించాలని అనుకుంది. అందం, అభినయం రెండూ ఉన్న ఈమెకు.. బుల్లితెరపై వచ్చినంత గుర్తింపు వెండితెరపై రాలేదు. ఆమె ఎంతలా అందాలు ఆరబోసినా.. సినిమా ఛాన్స్ లు మాత్రం పెద్దగా రాలేదు. చేసినవి కూడా పెద్దగా సక్సెస్ సాధించలేదు. అదే సమయంలో బుల్లితెరపై చేస్తున్న షోలు మాత్రం […]

Written By:
  • Mallesh
  • , Updated On : March 16, 2022 / 10:18 AM IST
    Follow us on

    Rashmi Gautam: తెలుగు బుల్లితెర స్టార్ యాంకర్ గా దూసుకుపోతున్న రష్మీకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. జబర్దస్త్ షో ద్వారా వచ్చిన ఫేమ్ తో వెండితెరపై కూడా రాణించాలని అనుకుంది. అందం, అభినయం రెండూ ఉన్న ఈమెకు.. బుల్లితెరపై వచ్చినంత గుర్తింపు వెండితెరపై రాలేదు. ఆమె ఎంతలా అందాలు ఆరబోసినా.. సినిమా ఛాన్స్ లు మాత్రం పెద్దగా రాలేదు.

    చేసినవి కూడా పెద్దగా సక్సెస్ సాధించలేదు. అదే సమయంలో బుల్లితెరపై చేస్తున్న షోలు మాత్రం టాప్ రేటింగ్స్ తో దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలో ఓ నిర్మాత ఆమెపై చేసిన కామెంట్లు సంచలనం రేపుతున్నాయి. నిర్మాత నాగలింగం రష్మీతో రాణిగారి బంగ్లా అనే సినిమా తీసిన సంగతి తెలిసిందే.

    Also Read:  రామరాజు పాత్రకు చరణ్ ను, భీమ్ పాత్రకు తారక్ ను తీసుకోవడానికి కారణం ఇదే..

    ముందు మాట్లాడుకున్నప్పుడు తక్కువ రెమ్యునరేషన్ ఇస్తామని తక్కువ బడ్జెట్ తో మేకింగ్ చేస్తామని చెప్పగా అందుకు రష్మీ ఓకే చెప్పిందట. కానీ సినిమా మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత.. డబ్బింగ్ మాత్రమే మిగిలి ఉన్న సమయంలో రష్మీ ఇబ్బంది పెట్టాలని చూసిందన్నారు. రెమ్యునరేషన్ సరిపోదని, ఎక్కువ ఇవ్వాలని డిమాండ్ చేసిందన్నారు. సినిమాలో హీరోను మార్చాలనీ చెప్పిందన్నారు. తనకు ఇండస్ట్రీలో నాగబాబు తెలుసని, శ్యాం ప్రసాద్ రెడ్డి తెలుసని బెదిరించాలని చూసిందని నిర్మాత నాగలింగం చెప్పుకొచ్చారు.

    Rashmi Gautam

    అయితే తనకు కూడా ఇండస్ట్రీలో చాలామంది తెలుసని, సినిమా మధ్యలో ఆపేస్తే లీగల్ కేసు పెడతానని, ఫిలిం ఛాంబర్ గేటుకు కట్టేసి కొడతానని చెప్పటంతో రష్మీ దిగొచ్చిందన్నారు. సినిమా మొత్తం కంప్లీట్ చేసిందని, నాగలింగం ఓ ఇంటర్వ్యూలో ఇదంతా చెప్పుకొచ్చారు. అయితే రష్మీ మంచి నటి అని ఆమెపై పొగడ్తలు కురిపించారు. ఇప్పుడు ఈ వార్త నెట్టింట్లో తెగ సంచలనం రేపుతోంది. మరి ఆయన చెప్పినట్లు రష్మి చేసిందా లేదా అన్నది మాత్రం రష్మి స్వయంగా చెప్పాల్సి ఉంది.

    Also Read:  ‘పుష్ప 3’లో హీరో విజయ్ దేవరకొండ.. మరి బన్నీ ఏమిటి ?

    Tags