Bigg Boss OTT Telugu Akhil Sarthak: ఈసారి సరికొత్తగా బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అయింది. నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అంటూ ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈసారి గతంలో ఎన్నడూ లేని విధంగా టాస్కులు జరుగుతున్నాయి. గొడవలు, తిట్టుకోవడాలు లాంటివి ఏ మాత్రం తక్కువగా ఉండకుండా కంటెస్టెంట్ లు చూస్తున్నారు. అయితే గతంలో జరిగిన విధి విధానాలకు పూర్తి భిన్నంగా ఈసారి జరుగుతోంది.

టెలివిజన్ లో ప్రసారం అయినప్పుడు కొన్ని సెన్సార్ రూల్స్ ఉండేవి. కానీ ఓటీటీలో అలాంటి రూల్స్ ఏమీ ఉండవు కాబట్టి ఇష్టానుసారంగా బూతులు మాట్లాడేస్తున్నారు కంటెస్టెంట్ లు. 17 మందిలో ఇప్పటికే మొదటివారం ముమైత్ ఖాన్, రెండో వారం శ్రీ రాపాక ఎలిమినేట్ అయిపోయారు. మూడో వారం బిగ్ బాస్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏకంగా ఒకేసారి 12 మంది నామినేట్ అయ్యారు.
Also Read: రామరాజు పాత్రకు చరణ్ ను, భీమ్ పాత్రకు తారక్ ను తీసుకోవడానికి కారణం ఇదే..
నామినేట్ అయిన వారిలో అఖిల్ సార్తక్ కూడా ఉన్నాడు. టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన అతి కొద్దిమందిలో అఖిల్ కూడా ఒకడు. కాగా ఇప్పుడు అతనికి ఓ లేడీ స్టార్ షాక్ ఇచ్చేస్తోంది. రెండవ వారం ఓటింగ్ లో టాప్ లో ఉన్న అఖిల్ ను మూడో వారం బిందుమాధవి వెనక్కి నెట్టేసింది. బిందుమాధవి ఇప్పుడు టాప్ ప్లేస్ లో ఉంది. మూడో ప్లేస్ లో ఆరియానా ఉన్నట్లు తెలుస్తోంది.

నాలుగో ప్లేస్ లో యాంకర్ శివ, ఐదో స్థానంలో హమీద, ఆరో స్థానంలో అజయ్, ఏడో స్థానంలో ఆర్జే చైతు, ఎనిమిదో స్థానంలో తేజస్వి ఉన్నారు. వీరికి ఉన్న ఓటింగ్ పర్సెంట్ చూస్తుంటే వీరంతా సేఫ్ అని తెలుస్తోంది. తొమ్మిదో స్థానంలో ఉన్న మిత్రశర్మ, పదో స్థానంలో ఉన్న నటరాజ్ మాస్టర్ సేఫ్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక 11వ స్థానంలో ఉన్న మహేష్ విట్టా, చివరి స్థానంలో ఉన్న స్రవంతిలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. కాకపోతే చివరి వరకు ఏం జరిగుతుందో తెలియదు కాబట్టి లాస్ట్ నాలుగు ప్లేసుల్లో ఉన్న వారిలో ఒకరికి గండం తప్పేలా లేదు.
Also Read: ‘కింగ్ ఖాన్.. ఓటీటీ సామ్రాజ్యాన్ని ఏలబోతున్నాడు !