Homeజాతీయ వార్తలుModi Uturn: సాగు చట్టాలు రద్దు.. సీఏఏ, ఎన్ఆర్సీ నుంచి మోడీ వెనక్కి తగ్గుతాడా?

Modi Uturn: సాగు చట్టాలు రద్దు.. సీఏఏ, ఎన్ఆర్సీ నుంచి మోడీ వెనక్కి తగ్గుతాడా?

Modi Uturn: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు వ్యవసాయ చట్టాలను ఇటీవల రద్దు చేస్తున్నట్లు ప్రధానమంత్రి మోదీ ప్రకటించారు. త్వరలో జరిగే శీతాకాల సమావేశాల్లో వీటిని పూర్తిగా రద్దు చేస్తామని తెలిపారు. దీంతో ఏడాది కాలంగా ఎండనకా.. వాననకా ఉద్యమం చేస్తున్న రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. మూడు వ్యవసాయ చట్టాలను మోదీ సర్కార్ రద్దు చేయడం వెనుక కారణాలపై రకరకాలుగా చర్చ సాగుతోంది. అయితే ఒక దశలో మోదీ పతనం మొదలైందని కొందరు వ్యాఖ్యలు చేస్తున్నారు. కేవలం 5 రాష్ట్రాల కోసమే వ్యవసాయ చట్టాలను రద్దు చేశారని కొందరు అంటున్నారు. దీంతో వచ్చే ఎన్నికల వరకు మోదీ సర్కార్ ప్రవేశపెట్టిన సీఏఏ, ఎన్ఆర్ సీ విషయంలో కూడా వెనక్కి తగ్గాల్సి వస్తుంది కావచ్చు.. అని జోష్యం చెబుతున్నారు. ఏడాది కాలంగా సాగిన రైతు ఉద్యమంతో బీజేపీ వెనక్కి తగ్గినప్పుడు, సీఏఏ ఆందోళనపై కూడా పునరాలోచిస్తుందా..? అన్న సంకేతాలు వెలువడుతున్నాయి.

Also Read: బీజేపీ సంచలనం.. ఏపీ మూడు రాజధానులకు వ్యతిరేకం.. పాదయాత్రకు సోము వీర్రాజు

modi uturn
modi uturn

వ్యవసాయ చట్టాలతో తమకు తీరని అన్యాయం జరుగుతుందని రైతులు ఆందోళన చెందారు. దీంతో ఢిల్లీ వేదికగా నిరసన తెలిపారు. ముఖ్యంగా పంజాబ్, హర్యానా, ఉత్తర ప్రదేశ్ కు చెందిన రైతులు ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. వీరిలో సిక్కులు ఎక్కువగా ఉండడం విశేషం. ఈ ఉద్యమంలో ఖలీస్థానీల ప్రమేయం ఉందని సుప్రీం కోర్టులో వాదించిన ప్రభుత్వం, అదే ఉద్యమం కారణంగా ఒకడుగు వెనకకు వేయాల్సి వచ్చింది. దీంతో బీజేపీ సిక్కుల విషయంలో తీవ్రంగా ఆలోచించినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఈనెల 19న గురునానయక్ జయంతి సందర్భంగా వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘వ్యవసాయ చట్టాల వల్ల రైతులకు మేలే జరుగుతుంది. కానీ కొంతమంది రైతులను ఒప్పించలేకపోయాం. వాటి ప్రాధాన్యత గురించి వివరించడానికి ఎంతో కృషి చేశాం కాని విఫలం చెందాం’ అని తెలిపారు.

అయితే రైతు చట్టాల విషయంలో వెనక్కి తగ్గిన ప్రభుత్వం సీఏఏ, ఎన్ ఆర్సీ విషయంలో కూడా వెనకడుగు వేస్తుందా..? అన్న చర్చ సాగుతోంది. కానీ జనవరి 3న కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ ప్రతిపక్షాలన్నీ ఏకమై వచ్చినా సీఏఏ విషయంలో వెనక్కి తగ్గేది లేదని తెలిపారు. అయితే రైతు చట్టాల ఉపసంహరణ తరువాత సోషల్ మీడియాలో సీఏఏ పై పోస్టులు విపరీతంగా వస్తున్నాయి. ‘మోదీ సిక్కులతో చెలగాటం ఆడారు. వారి చరిత్ర గురించి తెలిసి ఉండే వారి జోలికి వెళ్లేవారు కాదు. సీఏఏ ఉద్యమం లాగానే చట్టాల ఉద్యమం వదిలేస్తారని అనుకున్నారు. కానీ సిక్కులు వెనక్కి తగ్గకుండా వారు అనుకున్నది సాధించారు’ అని గుజరాత్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొపెసర్లు సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

మోదీ సర్కార్ చట్టాల విషయంలోనే కాకుండా ధరల నియంత్రణ అదుపు చేయలేకపోతుందని అంటున్నారు. పెట్రోల్, గ్యాస్ ధరలు ఆకాశాన్నంటుతుంటే వారికి అర్థం కావడం లేదని, ఒక్క ఉద్యోగ ప్రకటన లేక నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అంటున్నారు. జీడీపీలో పాకిస్థాన్ కంటే భారత్ వెనక స్థానంలో ఉండడం దారుణమని అన్నారు. ఇప్పుడు వ్యవసాయ చట్టాల్లో తప్పడు నిర్ణయం అని భావించిన బీజేపీ సర్కార్ త్వరలో సీఏఏ విషయంలోనూ ఇదే తంతు కొనసాగిస్తుందని చర్చలు పెడుతున్నారు.

పశ్చిమ బెంగాల్ లో 30 శాతం ముస్లింలు ఉన్నారు. ఇక్కడి వారికి సీఏఏ విధానం వల్ల ప్రభుత్వానికి ఎలాంటి లాభం చేకూరదు. ఇప్పటికే నోట్ల రద్దు, జీఎస్ టీ, చైనా దూకుడు నియంత్రించలేకపోవడం వంటి అంశాల్లో ఈ ప్రభుత్వం విఫలమైందని ప్రొఫెసర్లు అంటున్నారు. ఈ క్రమంలో ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ సైతం ‘సీఏఏ విషయంలో ఇదే ప్రకటన చేసే అవకాశం ఉంది’ అని వ్యాఖ్యానించారు.

Also Read: వ్యవసాయ చట్టాల రద్దు వెనుక ఇంత స్టోరీ ఉందా..?

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version