Devara Movie: ‘దేవర’ కలెక్షన్స్ ఫేక్..? అభిమానుల కోసం చేశామంటూ పొరపాటున నోరు జారిన నిర్మాత.. వైరల్ అవుతున్న వీడియో!

ఎన్టీఆర్ నటించిన 'దేవర' చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిందో మన అందరికీ తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం ఇప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి రన్ ని సొంతం చేసుకుంటుంది. రీసెంట్ గా విడుదలైన కొత్త సినిమాలను సైతం ఈ చిత్రం డామినేట్ చేయడం గమనార్హం. కలెక్షన్స్ అయితే అద్భుతంగానే వచ్చాయి, కానీ వాటిలో చాలా వరకు ఫేక్ ఉందని ట్రేడ్ పండితులు చెప్తున్న మాట.

Written By: Vicky, Updated On : October 12, 2024 9:40 am
Follow us on

Devara Movie : ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిందో మన అందరికీ తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం ఇప్పటికీ బాక్స్ ఆఫీస్ వద్ద మంచి రన్ ని సొంతం చేసుకుంటుంది. రీసెంట్ గా విడుదలైన కొత్త సినిమాలను సైతం ఈ చిత్రం డామినేట్ చేయడం గమనార్హం. కలెక్షన్స్ అయితే అద్భుతంగానే వచ్చాయి, కానీ వాటిలో చాలా వరకు ఫేక్ ఉందని ట్రేడ్ పండితులు చెప్తున్న మాట. డిస్ట్రిబ్యూటర్స్ రోజు ఇచ్చే వసూళ్లు చాలా వరకు గ్రాస్ ని షేర్ గా చెప్తున్నారని, అలాగే కొన్ని ప్రాంతాలకు చెందిన డిస్ట్రిబ్యూటర్స్ రిటర్న్ జీఎస్టీ ని కలిపి, వర్త్ షేర్స్ గా చెప్తున్నారని, ఇలా ఎన్నో రకాల వాదనలు వినిపిస్తున్నాయి. రెండవ రోజు అయితే సీడెడ్ లో వచ్చిన గ్రాస్ ని షేర్ గా చెప్పుకొచ్చారు.

ఇవన్నీ పక్కన పెడితే మూవీ టీం వేస్తున్న పోస్టర్స్ అత్యంత దారుణమైన ఫేక్ గా ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇటీవలే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 466 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసినట్టుగా ఒక పోస్టర్ ని విడుదల చేసారు. వాస్తవానికి వచ్చిన వసూళ్లు 350 కోట్ల రూపాయిలు మాత్రమే. కానీ నిర్మాతలు ఏకంగా వంద కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ ని అదనంగా జత చేసి చెప్పారు. ఇది కచ్చితంగా ఫేక్ అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ పెద్ద ఎత్తున ‘దేవర’ పై ట్రోల్స్ వేయడం మొదలు పెట్టారు. ఇది ఇలా ఉండగా ఈ చిత్రం ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ హక్కులను ‘భీమ్లా నాయక్’ నిర్మాత నాగ వంశీ కొనుగోలు చేసాడు. రీసెంట్ గా జరిగిన ప్రెస్ మీట్ లో ఆయన ‘దేవర’ కలెక్షన్స్ పై చేసిన కొన్ని కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియా లో పెను దుమారమే రేపింది.

ఒక విలేఖరి దేవర గురించి అడిగిన ప్రశ్నకు ఆయన మాట్లాడుతూ ‘నేను ఈ సినిమాని నిర్మాతల వద్ద కొని బయ్యర్స్ కి అమ్మాను. నేను కలెక్షన్స్ పరంగా సంతృప్తి చెందాను, వాళ్ళు కూడా సంతృప్తి చెందారు. పోస్టర్స్ మీద వేసిన కలెక్షన్స్ ని మేము నమ్మము అంటున్నారు, నమ్మకండి, నేనైతే నిజమైన కలెక్షన్స్ ని ఇచ్చాను’ అని అంటాడు. ఆ తర్వాత మొదటి రోజు ఎంత వసూళ్లు వచ్చాయి అని నాగ వంశీ ని అడగగా, ఆయన వంద కోట్లు వచ్చాయి అని అంటాడు. వేసుకున్న కలెక్షన్స్ కదా? అని విలేఖరులు అడగగా, నాగ వంశీ నవ్వుతూ లేచి వెళ్ళిపోతాడు. దీనిని సోషల్ మీడియా లో పవన్ కళ్యాణ్ అభిమానులు, రామ్ చరణ్ అభిమానులు, ప్రభాస్ అభిమానులు పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేయడం మొదలు పెట్టారు. దేవర కి వేసింది ఫేక్ కలెక్షన్స్ అని ప్రస్తుతం సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా చేసేసారు.

Tags