Bigg Boss Telugu 8: వీకెండ్ ఎపిసోడ్స్ లో నాగార్జున పెట్టే కొన్ని టాస్కులు హౌస్ మేట్స్ కి సోమవారం ఎపిసోడ్స్ లో నామినేషన్స్ కోసం పాయింట్స్ గా ఉపయోగపడుతాయి అనే విషయం అందరికీ తెలిసిందే. అలాగే వీకెండ్ ఎపిసోడ్స్ ద్వారా మాత్రమే హౌస్ మేట్స్ ఆట తీరులో, ప్రవర్తనలో మార్పులు మరుసటి వారం లో జరుగుతూ ఉంటాయి. గత వీకెండ్ ఎపిసోడ్స్ కారణంగా మణికంఠ లో ఎలాంటి మార్పులు వచ్చాయో మనమంతా చూసాము. అలా గేమ్ లో సమూలమైన మార్పులు తీసుకొని రాబోతున్నాయి ఈ వీకెండ్ ఎపిసోడ్స్. అయితే ఇరు క్లాన్స్ కి సంబంధించి హౌస్ లో ఉండేందుకు అర్హత లేని కంటెస్టెంట్స్ ఎవరు నాగార్జున అడుగుతాడు. దానికి హౌస్ మేట్స్ అందరూ ఎక్కువగా గౌతమ్, టేస్టీ తేజా, పృథ్వీ పేర్లు చెప్తారు. దీంతో నాగార్జున ఈ ముగ్గురిని సూట్ కేసులను సర్దుకొని స్టోర్ రూమ్ లో పెట్టమని ఆదేశిస్తాడు.
అయితే హౌస్ మేట్స్ అందరూ గత సీజన్ లో లాగానే ఈ సీజన్ లో కూడా గౌతమ్ ని టార్గెట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. అలా టార్గెట్ చేసేందుకు కూడా గౌతమ్ అనేక కారణాలు ఇచ్చాడు. అందులో మొదటి కారణం సీజన్ 7 లో కనపడిన గౌతమ్ ఈ సీజన్ లో కనపడలేదు. సీజన్ 7 లో గౌతమ్ ఏకంగా శివాజీ ని టార్గెట్ చేసి, ఎలాంటి భయం బెరుకు లేకుండా ఆడాడు. ఆ ఆట తీరు నచ్చబట్టే ఆయన అన్ని వారాలు హౌస్ లో కొనసాగాడు, టాప్ 5 లో స్థానం తృటిలో తప్పింది. కానీ ఆ గౌతమ్ ఇప్పుడు కనిపించడం లేదు, బయట విషయాలను చూసొచ్చి, చాలా సేఫ్ గా ఆడుతున్నట్టు అనిపించింది. ముఖ్యంగా మణికంఠ ని టార్గెట్ చేసేందుకు చాలా భయపడుతున్నాడు.
ఇది గౌతమ్ నైజం కాదు, అందుకే హౌస్ మేట్స్ అతనికి అనర్హత వేటు వేసి ఉండొచ్చు. ఇక టేస్టీ తేజ గురించి తెలిసిందే, ఎంటర్టైన్మెంట్ ని బాగా అందిస్తాడు, హౌస్ లో ఉన్న అందరితో బాగా కలిసిపోతాడు. ఇదే అతనిలో ఆడియన్స్ కి నచ్చే అంశాలు, అయితే ఈ సీజన్ లో అతనిలో అవే మిస్ అవుతున్నాయి. టాస్కులు కూడా పెద్దగా ఆడడం లేదు, అందుకే హౌస్ మేట్స్ అతనికి అనర్హత వేటు వేసి ఉండొచ్చని అంచనా. ఇక ఈ వారం అసలు గేమ్ లో పృథ్వీ కనిపించలేదు, ఎంతసేపు విష్ణు ప్రియ తో పులిహోరా కనిపిస్తూ మాత్రమే కనిపించాడు. అందుకే హౌస్ మేట్స్ అతన్ని ఎంచుకొని ఉండొచ్చు. అయితే ఈ ముగ్గురికి నాగార్జున బిగ్ బాస్ నుండి ప్రత్యేకమైన కాస్ట్యూమ్స్ తెప్పిస్తాడు. మళ్ళీ బిగ్ బాస్ తదుపరి ఆదేశం ఇచ్చే వరకు వీళ్ళు ఆ కాస్ట్యూమ్స్ ని మాత్రమే ధరించాలి. ఆ తర్వాత ఏమి జరిగింది అనేది నేటి ఎపిసోడ్ లో చూడాలి. ఇది ఇలా ఉండగా నామినేషన్స్ నుండి ఈ వారం పృథ్వీ సేఫ్ అయ్యినట్టు తెలుస్తుంది.