Telangana Students : ఉదయం నుంచి రాత్రి వరకు నిత్యం ఒత్తిడితో ఉండే విద్యార్థులు ఇక కొన్ని రోజుల పాటు రిలాక్స్ కానున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మిగతా సంస్థల కంటే విద్యాసంస్థల కంటేఎక్కువ సెలవులు ఉంటాయన్న విషయం తెలిసిందే. ఇందులో ముఖ్యంగా దసరా, సంక్రాంతి ఫెస్టివెల్స్ కు అధికంగా ఉంటాయి. అందుకే దసరా పండుగ ఎప్పుడు వస్తుందా? అని విద్యార్థులు మహిళలు ఎదురుచూస్తూ ఉంటారు. ఈ ఏడాది అకాడమిక్ క్యాలెండర్ ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అ ప్రకారంగానే సెలవులు ఉండే అవకాశం ఉంది. అయితే అప్పటి పరిస్థితుల బట్టి కొన్ని మార్పులు ఉండే అవకాశం ఉంది. అయితే తెలంగాణ విద్యార్థులు ఎక్కువగా దసరా సెలవుల గురించి గురించి ఎదురు చూస్తారు. ఆ వివరాల్లోకి వెళితే..
తెలంగాణలో బతుకమ్మ, దసరా పెద్ద పండుగ అని చెప్పవచ్చు. ఈ పండుగ వేడుకల్లో పాల్గొనేందుకు దూర ప్రాంతాల నుంచి సొంత ఊళ్లకు వస్తుంటారు. మహిళలకు బతకుమ్మ వేడుకలు ప్రారంభం నుంచి సద్దుల బతుకమ్మ వరకు సంబరాలు చేసుకుంటారు. ఈ సమయంలో విద్యార్థులకు కూడా ఎక్కువ రోజులు సెలవులు ఇస్తుంటారు. తెలంగాణ ప్రభుత్వం గత జూలైలో ప్రకటించిన ఆకడమిక్ క్యాలెండర్ ప్రకారం అక్టోబర్ 4 నుంచి 13 వరకు దసరా సెలవులు ప్రకటించారు. అయితే అంతకుముందే కొన్ని రకాలుగాలు సెలవులు రానున్నాయి.
అక్టోబర్ కంటే ముందే వచ్చే సెప్టెంబర్ లోనూ సెలవులు రానున్నాయి. సెప్టెంబర్ 15న ఆదివారం కానుంది. 16న మిలాన్ ఉద్ నబీ సందర్భంగా పబ్లిక్ హాలీడే ఇవ్వనున్నారు. అయితే ఇది 16న లేదా 17న ఉండొచ్చు. ముస్లింలు నిర్ణయించిన ప్రకారం ప్రభుత్వం సెలవుపై అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇక సెప్టెంబర్ 28న 4వ శనివారం కానున్నందున కొన్ని పాఠశాలలకు సెలవు ఉండనుంది. సెప్టెంబర్ 29న ఆదివారం కానుంది. సెప్టెంబర్ 29 తరువాత నాలుగు రోజుల తరువాత మళ్లీ దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి.
అంటే ఈసారి దసరా సెలవులతో పాటు సెప్టెంబర్ లోనూ పలు రకాలుగా సెలవు దినాలు రానున్నాయి. అయితే గత వర్షాల కారణంగా కొన్ని రోజుల పాటు సెలవులు ప్రకటించారు.ఈ నేపథ్యంలో పాఠశాలల్లో కొన్ని తరగతుల పాఠ్యాంశాలు పెండింగులో పడ్డాయి. ఈ కారణంగా సెలవుల సంఖ్య అలాగే ఉంటుందా? లేక తగ్గిస్తారా? అనేది తేలియాల్సి ఉంది. సెప్టెంబర్ 14న సెలవు దినం అన్నారు. కానీ వర్షాల కారణంగా సెలవులు ఇవ్వడంతో ఈరోజును రద్దు చేశారు. అలాగే వచ్చే సెలవుల్లో కోత ఉంటుందా? అనే చర్చ సాగుతోంది.
ఈసారి సంక్రాంతికి కూడా సెలవులు జవనరి 10 నుంచి ప్రారంభం కానున్నాయి. అప్పడు 9 రోజుల పాటు సెలవులు ఉండనున్నాయి. అంతకుముందు క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 22 నుంచి 29 వరకు సెలవులు ప్రకటించారు. అయితే ఇవి అన్ని విద్యాసంస్థలకు ఉండకపోవచ్చు. మొత్తంగా ఈ ఏడాది విద్యార్థులకు సెలవులు ఎక్కవగా రానున్నాయి. అయితే విద్యాశాఖ అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుంటే తగ్గే అవకాశం ఉంది.