Homeఎంటర్టైన్మెంట్Bheemla Nayak: దిల్​రాజు చేతుల్లోకి 'భీమ్లా నాయక్​' నైజామ్​ రైట్స్​.. ఎంత ఖర్చు పెట్టారో తెలిస్తే...

Bheemla Nayak: దిల్​రాజు చేతుల్లోకి ‘భీమ్లా నాయక్​’ నైజామ్​ రైట్స్​.. ఎంత ఖర్చు పెట్టారో తెలిస్తే షాక్​!

Bheemla Nayak: పవర్​స్టార్​ పవన్​కళ్యాణ్​ హీరోగా సాగర్​ కె.చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా భీమ్లానాయక్​. ఇందులో రానా కూడా నటిస్తున్నారు. మలయాళ సినిమా అయ్యప్పనుమ్ కోశియమ్​కు రీమేక్​గా ఈ సినిమా రూపొందుతోంది. భీమ్లా నాయక్​ సినిమాకు త్రివిక్రమ్​ స్క్రీన్​ ప్లే, మాటలు అందిస్తున్నారు. దీనికి తోడు ఇటీవలే ఆయన రాసిన ఓ పాట కూడా విడుదలైంది. లాలా భీమ్లా పేరుతో వచ్చిన ఆపాట ప్రస్తుతం నెట్టింట ఓ ఊపు ఊపేస్తోంది. కాగా, ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారు దర్శకనిర్మాతలు.

producer-dilraju-owned-bheemla-nayak-rights-at-nizam-area

అయితే, సంక్రాంతి బరిలో ఆర్​ఆర్​ఆర్​ వంటి పెద్ద సినిమాలుండటంతో జనవరి చివర వారంలో విడుదలయ్యే అవకాశం ఉందని సినీ వర్గాల్లో టాక్​ నడుస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రోమో, సాంగ్​లకు ప్రేక్షకుల నుంచి విపరీతమైన రెస్పాన్స్​ వస్తోంది. ఈ క్రమంలోనే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి తోడు తాజాగా, థియేట్రికల్​ రైట్స్​ విషయంలోనూ భారీ పోటీ నెలకొంది.

భీమ్లానాయక్​ సినిమా నైజాం రైట్స్​ను నిర్మాత దిల్​రాజు సొంతం చేసుకున్నట్లు సినీ వర్గాల్లో టాక్​ నడుస్తోంది. ఒక్క నైజాం ప్రాంతానికే రూ.40కోట్లు చెల్లించినట్లు సమాచారం. వకీల్​సాబ్​ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించిన పవన్​.. భీమ్లా నాయక్​తోనూ అదే మ్యాజిక్​ చేస్తాడని దిల్​రాజు భావిస్తున్నారు.

పవన్​ ఇమేజ్​ను దృష్టిలో పెట్టుకుని.. తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా త్రివిక్రమ్​ కథలో మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఇందులో పవన్​కు జోడీగా నిత్యామేనన్​ నటిస్తుండగా.. రానా సరసన సంయుక్తా మేనన్​ కనిపించనుంది. ఓ పోలీస్​, మిలిటరీ ఆఫీసర్​కి మధ్య జరిగే ఈగో ఇష్యూలపై ఈ కథ నడుస్తుంది. వచ్చే ఏడాది జనవరిలో ఈ సినిమా విడుదల కానున్న సంగతి తెలిసిందే.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular