Balayya: కొరటాల శివ రచయితగా ఉన్న సమయలోనే బాలయ్యకి ఒక కథ చెప్పాడు. ఆ కథ ఇంకా సినిమాగా తీయలేదు. ప్రస్తుతం కొరటాల ఆ కథను బాలయ్యతోనే చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. బాలయ్య అయితేనే ఆ కథకు న్యాయం జరుగుతుందని కొరటాల ఫీలింగ్. పైగా ఇండ్రస్ట్రీలో ఉన్న ప్రతి స్టార్ హీరోతోనూ ఓ సినిమా చేయాలని కొరటాల శివ ఇప్పటికే ఓ టార్గెట్ పెట్టుకున్నాడు కాబట్టి.. ఎన్టీఆర్ తో చేయబోయే సినిమా అనంతరం.. బాలయ్యతో సినిమా చేస్తాడట.

ప్రభాస్, మహేష్‌బాబు, ఎన్టీఆర్ లతో కొరటాల ఆల్ రెడీ సినిమాలు చేసేశాడు. అలాగే ప్రస్తుతం చిరంజీవి, చరణ్ లతో సినిమా చేస్తున్నాడు. ఇక మిగిలిన స్టార్లతో కూడా సినిమాలు చేస్తాడట. బాలయ్య తర్వాత కొరటాల లిస్ట్ లో బన్నీ కూడా ఉన్నాడు. ఆ తర్వాత అన్ని కుదిరితే పవన్ కళ్యాణ్ తో కూడా ఒక సినిమా చేస్తాడట. నిజానికి ‘భరత్ అనే నేను’ అనే సినిమాను ముందు పవన్ కోసమే కొరటాల రాశాడు.
అప్పుడు పవన్ రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉండటంతో ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ఆ కథ మహేష్ కి వెళ్ళింది. హీరోల ఇమేజ్ ను బట్టి కథలు రాయడంలో కొరటాల దిట్ట. అన్నట్టు బాలయ్య కోసం కొరటాల ఏ జోనర్ లో సినిమా చేయబోతున్నాడు ? ఓ పీరియాడిక్ కథ అయితే కొరటాల దగ్గర ఎప్పటి నుంచో ఉందట. ఫుల్ స్క్రిప్ట్ కూడా రెడీ అయిందట.
బాలకృష్ణతో సినిమా చేయడానికి ఇది కూడా ఒక కారణం. ఎలాగూ బాలయ్య మాత్రమే చేయదగిన కథ కాబట్టి.. బాలయ్య కూడా ఈ మధ్య ఫుల్ ట్రెండ్ లోకి వచ్చాడు కాబట్టి.. బాలయ్య పై ఉన్న నెగిటివ్ ఇమేజ్ ఈ మధ్య తొలిగిపోతుంది కాబట్టి.. మొత్తానికి కొరటాల, బాలయ్య దగ్గరకు వెళ్ళడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు.
Also Read: Sara Alikhan: మాల్దీవ్స్ బీచ్ లో మల్టీ-కలర్ కార్టూన్ ప్రింట్ బికినీలో బీ టౌన్ బ్యూటీ
ఇక బాలయ్యతో సినిమాను పట్టాలెక్కించడం చాలా ఈజీ. ఏ స్టార్ డైరెక్టర్ కి బాలయ్య నో చెప్పడు. కాబట్టి, ఈ కాంబో దాదాపుగా ఖాయంగా కనిపిస్తోంది. పైగా ఓ అగ్ర నిర్మాత కూడా కొరటాలని – బాలయ్యను కలపాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నాడట. మొత్తమ్మీద కొరటాల బాలయ్యనే కాదు ఏ స్టార్ ను వదిలిపెట్టేలా లేడు.
Also Read: KBR Park: కేబీఆర్ పార్క్ లో టాలీవుడ్ హీరోయిన్ పై దాడి.. షాకింగ్ ఘటన