https://oktelugu.com/

Akhanda: ‘అఖండ’ విజయోత్సాహంతో బాలయ్యకు దిల్​రాజు ట్రీట్​

Akhanda: నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా అఖండ.. డిసెంబరు 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా.. థియేటర్​కి వచ్చిన ప్రతి ఒక్కరికీ పూనకాలు తెప్పిస్తోంది. భాష, ప్రాంతంతో సంబంధం లేకుండా అన్ని చోట్లా భారీ రికార్డులతో దూసుకెళ్లిపోతోంది. ఓవర్సీస్​లోనూ అఖండ జోరు మాములుగా లేదు. విడుదలైన రెండ్రోజుల్లోనే 50కోట్ల షేర్​ను రాబట్టినట్లు సమాచారం. అమెరికాలో అయితే, ప్రీమియర్ షో కలెక్షన్స్​తోనే రికార్డులు బద్దలు కొట్టింది. ఈ క్రమంలోనే ప్రముఖ దర్శకుడు దిల్​ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 7, 2021 / 09:40 AM IST
    Follow us on

    Akhanda: నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా అఖండ.. డిసెంబరు 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా.. థియేటర్​కి వచ్చిన ప్రతి ఒక్కరికీ పూనకాలు తెప్పిస్తోంది. భాష, ప్రాంతంతో సంబంధం లేకుండా అన్ని చోట్లా భారీ రికార్డులతో దూసుకెళ్లిపోతోంది. ఓవర్సీస్​లోనూ అఖండ జోరు మాములుగా లేదు. విడుదలైన రెండ్రోజుల్లోనే 50కోట్ల షేర్​ను రాబట్టినట్లు సమాచారం. అమెరికాలో అయితే, ప్రీమియర్ షో కలెక్షన్స్​తోనే రికార్డులు బద్దలు కొట్టింది.

    Akhanda

    ఈ క్రమంలోనే ప్రముఖ దర్శకుడు దిల్​ రాజు అఖండ టీమ్​కు బిగ్ సర్​ప్రైజ్ ఇచ్చారు. అఖండ భారీ సక్సెస్​ సందర్భంగా దిల్​ రాజు అఖండ టీమ్​తో కేక్ కట్​ చేయంచారు. ఇలా టీమ్​కు మంచి ట్రీట్​ ఇచ్చారు. కాగా, ఈ పార్టీకు బాలయ్యతో పాటు నిర్మాత మిర్యాల రవీందర్‌రెడ్డి, దర్శకుడు బోయపాటి శ్రీను, హీరోయిన్ ప్రగ్యా జైశ్వాల్ సహా పలువురు దిల్ రాజు సన్నిహితులు హాజరయ్యారు.

    Akhanda

    Also Read: రాజమౌళి కారణంగానే పవన్ ను పోటీలోకి దించుతున్నాడు !

    మరోవైపు బాలయ్యతోనూ సినిమా చేయాలని దిల్​రాజు ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. పవర్​ స్టార్ పవన్​ కల్యాణ్​ సినమా వకీల్​సాబ్​కు మొదట్లో బాలయ్య దగ్గరికి వెళ్లిన సంగతి తెలిసిందే.. అయితే కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్​ సెట్​ కాలేకపోయింది. ఇప్పుడు అఖండ భారీ విజయం సాధించిన నేపథ్యంలో బాలయ్యతో మంచి సినిమాకు దిల్​రాజు ప్లాన్​ చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే దర్శకుడు వేణు శ్రీరామ్ బాలయ్యతో సినిమా తీసేందుకు సిద్ధంగా ఉన్నాడని టాక్ నడుస్తోంది. కాగా, ప్రస్తుతం బాలయ్య మూడు పెద్ద సినిమాలతో ఫుల్​ బిజీగా ఉన్నారు. ఇవి పూర్తయిన తర్వాతే దిల్​రాజు సినిమా గురించి ఆలోచించనున్నట్లు తెలుస్తోంది.

    Also Read: అరెరే.. ‘పుష్ప’లో ఆ కళ మిస్ అయిందే !