https://oktelugu.com/

Upasana: జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ.. ఉపాసన ఎమోషనల్​ పోస్ట్​.. సమంత స్వీట్​ రియాక్షన్​

Upasana: మెగాస్టార్ రామ్​చరణ్​ సతీమణి ఉపాసన గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఓ వైపు అపోలో ఆసుపత్రి బాధ్యతలు చేపడుతూనే… మరోవైపు సామాజిక కార్యక్రమాలు చేస్తూ తనకంటూ ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే, సోషల్​మీడియాలోనూ ఉపాసన ఎప్పుడూ యాక్టీవ్​గా ఉంటుంటారు. ఫిట్​నెస్​తో పాటు ఆయుర్వేద వైద్యం, జంతువుల పరిరక్షణ గురించి ఎప్పటికప్పుడు జనాలను అవగాహన కల్పిస్తూ.. వీడియోస్ షేర్​ చేస్తుంటారు. అలాగే ఆహారపు అలవాట్లు.. ఆరోగ్యమైన భోజనం ఇలాంటి వీడియోలనూ షేర్​ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : December 7, 2021 / 09:55 AM IST
    Follow us on

    Upasana: మెగాస్టార్ రామ్​చరణ్​ సతీమణి ఉపాసన గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఓ వైపు అపోలో ఆసుపత్రి బాధ్యతలు చేపడుతూనే… మరోవైపు సామాజిక కార్యక్రమాలు చేస్తూ తనకంటూ ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అలాగే, సోషల్​మీడియాలోనూ ఉపాసన ఎప్పుడూ యాక్టీవ్​గా ఉంటుంటారు. ఫిట్​నెస్​తో పాటు ఆయుర్వేద వైద్యం, జంతువుల పరిరక్షణ గురించి ఎప్పటికప్పుడు జనాలను అవగాహన కల్పిస్తూ.. వీడియోస్ షేర్​ చేస్తుంటారు. అలాగే ఆహారపు అలవాట్లు.. ఆరోగ్యమైన భోజనం ఇలాంటి వీడియోలనూ షేర్​ చేస్తుంటారు.

    https://www.instagram.com/p/CXJNZDmhAdT/?utm_source=ig_web_copy_link

    Also Read: త్రివిక్రమ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నటి నిత్యా మీనన్…

    కాగా, ప్రస్తుతం ఉపాసన తన సోదరి అనుష్పాల వివాహ వేడుకలకు సంబంధించిన అప్​డేట్స్​ను ఎప్పటికప్పుడు తన సోషల్​మీడియా ఖాతాలో షేర్​ చేస్తున్నారు. దోమరకొండ గడికోటలో అనుష్పాల వివాహ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు మెగాఫ్యామిలీ మొత్తం హాజరయ్యారు. కాగా, తాజాగా ఉపాసన తన సోదరి వివాహం వేడుకలో వివాహ విశేషాలను గుర్తు చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే గతంలో పోచమ్మ గుడికి వెళ్లినప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు ఉపాసన. తొమ్మిదేళ్ల క్రితం తన వివాహ వేడుకలో పోచమ్మ పండగ వేడుకకు వేసుకున్న దుస్తులను రీక్రియేట్ చేస్తూ.. ఇప్పుడు తన సోదడి వివాహ వేడుకలో.. మళ్లీ పోచమ్మ పండగకు వేసుకున్నట్లు చెప్తూ.. ఇన్​స్టాగ్రామ్​ వేదికగా పోస్ట్ చేసింది.

    ఈ క్రమంలోనే కొన్ని దుస్తులతో వెలకట్టలేని ఎమోషన్స్ దాగి ఉంటాయని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్​గా మారాయి. ఈ క్రమంలోనే ప్రముఖ హీరోయిన్​ సమంత కూడా ఈ పోస్ట్​గా స్పందించింది. బ్యూటిఫుల్ అంటూ తనదైన స్టైల్​లో రియాక్షన్​ ఇచ్చింది.

    Also Read: నేను మళ్ళీ ఎలా షేప్ లోకి వచ్చానంటే.. ?