https://oktelugu.com/

Dil Raju : నిర్మాత దిల్ రాజు తల్లికి తీవ్ర అస్వస్థత.. హుటాహుటిన హాస్పిటల్ కి తరలించిన ఐటీ అధికారులు!

గత రెండు రోజులుగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇంట్లో ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మొన్న తెల్లవారుజామున 5 గంటలకు మొదలైన సోదాలు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి.

Written By: , Updated On : January 23, 2025 / 03:24 PM IST
Dil Raju

Dil Raju

Follow us on

Dil Raju : గత రెండు రోజులుగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇంట్లో ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మొన్న తెల్లవారుజామున 5 గంటలకు మొదలైన సోదాలు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. నేడు కూడా ఐటీ అధికారులు ఆయన ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. మీడియా నిన్న దిల్ రాజు ఇంటికి వెళ్లి అసలు ఏమి జరుగుతుందో అడగగా, ఆయన తన కుమారుడితో రిలాక్స్ గా ఆడుకుంటూ కనిపించారు. ఐటీ అధికారులు ఏమి చేస్తున్నారు సార్, ఏమైనా దొరికాయా అని అడగగా, దానికి దిల్ రాజు నేను వాళ్ళ రైడింగ్ గురించి మాట్లాడడానికి అనుమతి లేదు. వాళ్ళు అనుమతిస్తే చెప్తా అని చెప్పుకొచ్చాడు. ఇకపోతే నేడు ఐటీ అధికారులు ఆయన ఇంట్లో సోదాలు నిర్వహిస్తుండగా, దిల్ రాజు తల్లికి అస్వస్థత ఏర్పడింది. దీంతో వెంటనే ఐటీ అధికారులు తమ కారులో సమీప హాస్పిటల్ కి ఆమెని తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

దిల్ రాజు తో పాటు, ఒక ఐటీ అధికారి కూడా హాస్పిటల్ కి వచ్చినట్టు తెలుస్తుంది. దిల్ రాజు కి గత కొంతకాలం నుండి బ్యాడ్ టైం మామూలు రేంజ్ లో లేదు. సినిమాలు సరిగా ఆడడం లేదు, మధ్యలో ఇలాంటి ఘటనలు, కొన్ని సినిమాలు హిట్ అయ్యి లాభాలు వస్తున్నాయి కానీ, అవి ఎదో ఒక సినిమాలో పెట్టుబడి రూపం లో మాయమైపోతున్నాయి. డిస్ట్రిబ్యూటర్ గా విజయాలు అందుకుంటున్నాడు కానీ, నిర్మాతగా మాత్రం ఈ మధ్య కాలం లో విజయాలు తక్కువే. ప్రస్తుతం ఆయన నిర్మించిన ‘గేమ్ చేంజర్’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రాలు థియేటర్స్ లో ప్రదర్శితమవుతున్నాయి. ‘గేమ్ చేంజర్’ చిత్రానికి డిజాస్టర్ రెస్పాన్స్ రాగా, ‘సంక్రాంతికి వస్తున్నాం’ మాత్రం మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ తో, కళ్ళు చెదిరే వసూళ్లతో బాక్స్ ఆఫీస్ షేక్ చేస్తూ ముందుకు దూసుకుపోతుంది.

ఇదంతా పక్కన పెడితే ఐటీ అధికారులు మూడు రోజులు సోదాలు నిర్వహించేంత లెక్కా పత్రాలు దిల్ రాజు ఇంట్లో ఉన్నాయా..?, ఇంతకు ఆయన ఆస్తులు ఎంత అని సోషల్ మీడియా లో నెటిజెన్స్ మాట్లాడుకుంటున్నారు. నైజాం, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో విడుదలయ్యే 50 శాతం కి పైగా సినిమాలకు దిల్ రాజు డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరిస్తూ ఉంటాడు. వీటి నుండి ఆయనకీ వచ్చే లాభాలు మామూలు రేంజ్ లో ఉండవు. భవిష్యత్తులో విడుదల కాబోతున్న రాజమౌళి, మహేష్ బాబు సినిమాకి కూడా నైజాం ప్రాంతం లో ఈయనే డిస్ట్రిబ్యూటర్ గా వ్యవహరిస్తున్నాడు. అంతే కాకుండా పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే భారీ అంచనాలను ఏర్పాటు చేసుకున్న ఓజీ నైజాం హక్కులను కూడా ఈయనే దక్కించుకున్నాడు. ఇలాంటి లెక్కలు ఎన్నో ఉన్నాయి కాబట్టే ఇన్ని రోజుల సమయం తీసుకొని ఆయన ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.