https://oktelugu.com/

YSR Congress leaders : అధినేత తీరుపై వైసీపీ నేతల అసహనం.. జిల్లాపై వారి పెత్తనం ఏంటి?

ఇతర జిల్లాల నేతల పెత్తనంపై వైసీపీ నేతలు( YSR Congress leaders ) రుసరుసలాడుతున్నారు. అధినేత తీరుపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Written By: , Updated On : January 23, 2025 / 03:57 PM IST
YCP Party

YCP Party

Follow us on

YSR Congress leaders :  ఉత్తరాంధ్ర ( North Andhra )వైసీపీలో కోల్డ్ వార్ మొదలైందా? విజయసాయిరెడ్డి వర్సెస్ బొత్సగా మారిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. వైసీపీ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో ఉత్తరాంధ్ర పార్టీ సమన్వయకర్తగా వ్యవహరించారు విజయసాయిరెడ్డి. ఆ సమయంలో విజయసాయిరెడ్డి పెత్తనాన్ని ప్రశ్నించారు బొత్స. మరోవైపు విశాఖలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు విజయసాయిరెడ్డి పై వచ్చాయి. పార్టీలో అంతర్గతంగా చాలా రకాలుగా పరిణామాలు చోటుచేసుకున్నాయి. విజయసాయి రెడ్డి పై సొంత పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు అప్పట్లో. అయితే దాని వెనుక ఉత్తరాంధ్ర సీనియర్ నేతలు ఉన్నారన్నది ఒక ఆరోపణ. ఎన్నికల కు ముందు ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని తెలిసి జగన్ విజయసాయిరెడ్డిని పార్టీ ఉత్తరాంధ్ర ఇన్చార్జి పదవి నుంచి తొలగించారు. వేరే బాధ్యతలు కట్టబెట్టారు. విజయసాయిరెడ్డి స్థానంలో తన బాబాయ్ వైవి సుబ్బారెడ్డి కి ఛాన్స్ ఇచ్చారు. అయితే ఈ ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో వైసీపీ తుడిచిపెట్టుకుపోయింది. దానికి బాధ్యత వహిస్తూ వైవి సుబ్బారెడ్డిని తప్పించారు. మళ్లీ విజయసాయి రెడ్డికి ఉత్తరాంధ్ర ఇన్చార్జి బాధ్యతలు ఇచ్చారు. దీంతో పరిస్థితి మొదటికి వచ్చింది.

* మైండ్ గేమ్ ఆడుతున్న జగన్
అయితే ఉత్తరాంధ్ర విషయంలో జగన్( Jagan Mohan Reddy) మైండ్ గేమ్ ఆడుతున్నట్లు ప్రచారం నడుస్తోంది. అటు ఉత్తరాంధ్ర ఇన్చార్జిగా తన విధేయుడైన విజయసాయిరెడ్డికి ఛాన్స్ ఇచ్చారు. అదే సమయంలో విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణకు అవకాశం కల్పించారు. అయితే ఇక్కడే జగన్ ప్లాన్ చేసినట్లు స్పష్టమవుతుంది. గతంలో ఇదే విజయసాయిరెడ్డి పై వైసీపీ నేతలు ఆరోపణలు చేయగా తప్పించారు. ఇప్పుడు ఆయనను నియమించడమే కాకుండా బొత్సకు కూడా విశాఖలో ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు ఇది చాలదన్నట్టు భీమిలి నియోజకవర్గ బాధ్యతలను బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావుకు కట్టబెట్టారు. దీంతో జగన్ స్ట్రాటజీ ఏంటో విశాఖ వైసిపి నేతలకు అర్థం కావడం లేదు. బొత్సను నిలువరించడానికి విజయసాయిరెడ్డిని.. విజయసాయిరెడ్డి లైన్ దాటకుండా బొత్సను ప్రయోగిస్తున్నట్లు అర్థమవుతోంది.

* ఆశించిన పదవి అది
వాస్తవానికి బొత్స సత్యనారాయణ( Botsa Satyanarayana) ఉత్తరాంధ్ర సమన్వయ బాధ్యతలను ఆశించారు. కానీ ఆయనను గోదావరి జిల్లాల ఇన్చార్జిగా నియమించారు జగన్. ఇది ఎంత మాత్రం బొత్స కు మింగుడు పడడం లేదు. ఎందుకంటే విశాఖలో ఎమ్మెల్సీగా ఉంటూ ఉత్తరాంధ్ర బాధ్యతలు అయితే పార్టీని తన చెప్పు చేతల్లో ఉంచుకోవచ్చు అన్నది బొత్స భావన. ఈ విషయాన్ని పసిగట్టారు కాబోలు జగన్ ముందుగానే జాగ్రత్తపడ్డారు. మళ్లీ విజయసాయి రెడ్డికి ఉత్తరాంధ్ర ను కేటాయించారు. అలాగని విజయసాయిరెడ్డి తోక జాడించకుండా ఉండేందుకు బొత్స కుటుంబానికి విశాఖలో అవకాశం కల్పించారు. మొన్నటి ఎన్నికల్లో విశాఖ లోక్సభ స్థానం నుంచి బొత్స సతీమణి ఝాన్సీ లక్ష్మి వైసీపీ నుంచి బరిలో దిగారు. కానీ ఓటమి తప్పలేదు. బొత్స కుటుంబానికి విశాఖలో కూడా పట్టు ఉంది. అలా పార్టీలో గ్రిప్ పోకుండా.. బొత్స చేయి దాటకుండా విజయసాయిరెడ్డిని జగన్ ప్రోత్సహిస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది.

* అప్పట్లో అనేక ఆరోపణలు
వాస్తవానికి విజయసాయిరెడ్డి( Vijaya Sai Reddy) విశాఖలో ఉంటూ భారీ దోపిడీకి పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. వైసిపి హయాంలో అడ్డగోలుగా దోచుకున్నారన్న కామెంట్స్ వినిపించాయి. చివరకు పార్టీ ఎంపీగా ఉన్న ఎంవీఎస్ మూర్తి అప్పట్లో ఏకంగా అధినేత జగన్కు ఫిర్యాదు చేశారు. అప్పట్లో అది పెను దుమారంగా మారింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత విజయసాయిరెడ్డి దందా బయటపడింది. మరోవైపు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ వ్యవహార శైలి, అప్పట్లో విజయసాయిరెడ్డి జరిపిన భూదందా వంటివి బయటపడ్డాయి. కానీ జగన్ మాత్రం వాటిని పరిగణలోకి తీసుకోలేదు. ఉత్తరాంధ్రకు తిరిగి విజయసాయిరెడ్డిని ఇన్చార్జిగా నియమించారు. ఇది బొత్స హవా కు బ్రేక్ చేయడానికి పరిశీలకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఉభయగోదావరి జిల్లాల్లో జనసేన ప్రాబల్యం ఎక్కువ. పైగా కాపులు ఎక్కువగా ఉంటారు. అందుకే బొత్సను అక్కడ రీజినల్ కోఆర్డినేటర్ గా నియమించినట్లు వైసిపి వర్గాలు చెబుతున్నాయి.

* విశాఖ వైసిపి నేతల ఆగ్రహం
అయితే విశాఖ( Visakhapatnam) వైసీపీ నేతల పరిస్థితి ఇంకోలా ఉంది. తమ జిల్లాలపై బలవంతంగా నేతలను రుద్దడం ఏంటని జగన్ పై రుసరుసలాడుతున్నారు. వాస్తవానికి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి స్పష్టమైన బలం ఉంది. అయితే అధికార పార్టీ దూకుడుకు బలమైన నేత అవసరమని భావించి బొత్సకు అవకాశం ఇచ్చారు. వాస్తవానికి అక్కడ బలమైన అభ్యర్థులుగా బూడి ముత్యాల నాయుడు, గుడివాడ అమర్నాథ్ లాంటి నేతలు ఉన్నారు. కానీ వారిద్దరినీ కాదని పొరుగు జిల్లాకు చెందిన బొత్సను తీసుకురావడం ఏంటన్నది విశాఖ వైసిపి నేతల ప్రశ్న. అయితే అప్పట్లో రాజకీయ సమీకరణల్లో భాగంగా బొత్సను తీసుకువచ్చినట్లు సమర్ధించుకున్నారు. మరోవైపు తాజాగా భీమిలి నియోజకవర్గ ఇన్చార్జిగా బొత్స కుటుంబానికి చెందిన మజ్జి శ్రీనివాసరావును తీసుకొచ్చారు. ఇన్చార్జి పదవిని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆశించారు. కానీ ఆయనకు అవకాశం ఇవ్వలేదు జగన్. మరోవైపు విజయసాయి రెడ్డికి సమన్వయకర్తగా ఉంచారు. మళ్లీ ఆయన పెత్తనం విశాఖ పై ప్రారంభం అయింది. దీంతో అధినేత తీరుపై విశాఖ వైసీపీ నేతలు అసహనంతో ఉన్నారు. మున్ముందు ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయో చూడాలి.