https://oktelugu.com/

‘దిల్ రాజు’ గారి ఆవేదన !

టాలీవుడ్ లో దిల్ రాజు అనే వ్యక్తి ఒక అగ్ర నిర్మాత.. పైగా థియేటర్ల పై అధికారం సాధించి కొనసాగుతున్న ఒక శక్తి కూడా. కానీ ఎంత శక్తి అయినా ఏదొక రోజు శక్తి కోల్పోవాల్సి వస్తోందనేది పురాణ ఇతిహాసాలు కూడా చెప్పాయి. ఇప్పుడు దిల్ రాజు కూడా శక్తి పోగొట్టుకునే పరిస్థితుల్లో ఉన్నాడు. చేతిలోని థియేటర్లను మెయింటైన్ చెయ్యలేక వాటిని వదిలించుకునే ఆలోచనలో ఉన్నాడు. వెగటు పుట్టిస్తున్న లోకేష్ కుల రాజకీయం అదే జరిగితే ఇన్నేళ్లు […]

Written By:
  • admin
  • , Updated On : June 26, 2020 12:15 pm
    Follow us on


    టాలీవుడ్ లో దిల్ రాజు అనే వ్యక్తి ఒక అగ్ర నిర్మాత.. పైగా థియేటర్ల పై అధికారం సాధించి కొనసాగుతున్న ఒక శక్తి కూడా. కానీ ఎంత శక్తి అయినా ఏదొక రోజు శక్తి కోల్పోవాల్సి వస్తోందనేది పురాణ ఇతిహాసాలు కూడా చెప్పాయి. ఇప్పుడు దిల్ రాజు కూడా శక్తి పోగొట్టుకునే పరిస్థితుల్లో ఉన్నాడు. చేతిలోని థియేటర్లను మెయింటైన్ చెయ్యలేక వాటిని వదిలించుకునే ఆలోచనలో ఉన్నాడు.

    వెగటు పుట్టిస్తున్న లోకేష్ కుల రాజకీయం

    అదే జరిగితే ఇన్నేళ్లు అగ్ర నిర్మాతగా ఈ తరం సినీ నిర్మాణ విభాగానికి ప్రతినిధిగా వస్తోన్న అగ్ర గౌరవం అగ్ర గుర్తింపు ఇక రావడం కష్టమే. ఇన్నాళ్లు తన నిర్మాణ సంస్థే ఒక చిన్న సినీ పరిశ్రమ అన్న స్థాయిలో ప్రమోట్ చేసుకున్న రాజు.. ఇక నుండి నిర్మాతల అందరిలో ఒకడిగా ఉండిపోవాల్సిందే.

    పైగా అగ్ర హీరోలతో కూడా దిల్ రాజు ఈ మధ్య చాలా సమస్యలను ఎదుర్కొంటున్నాడని.. ముఖ్యంగా సినిమా బిజినెస్ విషయంలో స్టార్ హీరోలతో దిల్ రాజుకి తలనొప్పిగా మారిందని… ఒక సూపర్ స్టార్ తో గత సినిమా బిజినెస్ విషయంలో దిల్ రాజుకి అభిప్రాయభేదాలు వచ్చాయని సమాచారం. దానికి కారణం ఈ మధ్య హీరోలు రెమ్యూనరేషన్ తీసుకోకుండా నాన్-థియోటర్స్ రైట్స్ తీసుకుంటున్నారు. ఇప్పుడున్న కరోనా పరిస్థితుల్లో ఇక థియేటర్ల నుండి వచ్చేది లేదు.. భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పలేం.

    కేసీఆర్ తో ప్రత్యక్ష యుద్ధానికి తమిళిసై రె’ఢీ’?

    మొత్తానికి దీని పై దిల్ రాజు అసహనంగా ఉన్నాడట. కరోనా అనంతరం కూడా ఇది ఇలాగే కొనసాగితే ఇక నిర్మాతకి ఒక రూపాయి కూడా రాదనేది రాజుగారి ఆవేదన. మరి ఇప్పటికైనా సినిమాలకి హీరోలు రెమ్యూనరేషన్ తీసుకుని, నాన్-థియోటర్స్ రైట్స్ తీసుకోవడం మానేయాలి. అయినా లాభాలు వచ్చేవాటిని హీరోలు తీసుకుంటే.. నిర్మాతలకు ఇక సినిమాలు చేసి ఏమి లాభం. పైగా కరోనా లాంటి పరిస్థితుల్లో ఇలాంటి సమస్యలతో సినిమాలు చేయడం అసాధ్యం కూడా.