వైసీపీకి షాక్ ఇచ్చే సమాధానం ఇచ్చిన ఎంపీ..!

నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు వైసీపీ నుంచి షోకాజ్ నోటీస్ అందుకున్నా తన తీరు మార్చుకోలేదు. షోకాజ్ నోటీస్ కు ఇచ్చిన సమాధానంతో ఆ పార్టీని మరింత ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. తాను యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందానని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి కాదని, తనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరుతో షోకాజ్ నోటీస్ జారీ చేశారనే సమాధానంతో పార్టీకి పెద్ద షాక్ ఇచ్చారు. తనకు నోటీస్ ఇచ్చిన లెటర్ […]

Written By: Neelambaram, Updated On : June 26, 2020 12:15 pm
Follow us on


నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు వైసీపీ నుంచి షోకాజ్ నోటీస్ అందుకున్నా తన తీరు మార్చుకోలేదు. షోకాజ్ నోటీస్ కు ఇచ్చిన సమాధానంతో ఆ పార్టీని మరింత ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. తాను యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందానని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి కాదని, తనకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పేరుతో షోకాజ్ నోటీస్ జారీ చేశారనే సమాధానంతో పార్టీకి పెద్ద షాక్ ఇచ్చారు. తనకు నోటీస్ ఇచ్చిన లెటర్ హెడ్ కు, బ్ ఫామ్ కు తేడా ఉందని స్పష్టం చేశారు. దీంతో షోకాజ్ నోటీస్ కు ఎంపీ రఘురామ కృష్ణంరాజు పార్టీపై విమర్శల విషయంలో వెనక్కి తగ్గుతారనే వైసీపీ నేతల ఆశలు ఆడియాశలు అయ్యాయి.

నిమ్మగడ్డ నిజాయితీపై నీలినీడలు

తనకు ఇచ్చిన షోకాజ్ నోటీస్ కు చట్ట బద్ధత లేదనే విషయాన్ని స్పష్టం చేశారు. ఎన్నికల సంఘము నిబంధనల ప్రకారం పార్టీలో సభ్యులు క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడినప్పుడు పార్టీలోని క్రమశిక్షణా సంఘము సమావేశం నిర్వహించి, ఆ అంశాన్ని చర్చించి అప్పుడు నోటీసు ఇవ్వాలన్నారు. అలా ఇస్తే ఆ సమావేశం ఎప్పుడు, ఎక్కడ జరిగిందని ప్రశ్నించారు. సమావేశం నిర్వహించకుండా ఇచ్చారు. అసలు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి క్రమశిక్షణా సంఘము లేదన్నారు.

తాను గెలుపోపొందిన యువజన శ్రామిక రైతు పార్టీ ప్రాంతీయ పార్టీ అని పేర్కొన్నారు. ఆ పార్టీకి జాతీయ ప్రధాన కార్యదర్శి ఎలా ఉంటారని ప్రశ్నించారు. తనకు షోకాజ్ నోటీస్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వి. విజయ సాయిరెడ్డి పేరుతో వచ్చిందన్నారు.

వెగటు పుట్టిస్తున్న లోకేష్ కుల రాజకీయం

అదేవిధంగా ఆయన విడుదల చేసిన వీడియోలో తాను పార్టీని ఎప్పుడు విమర్శించలేదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కొన్ని పథకాల విషయంలో లోటు పాట్లను సీఎం జగన్మోహన్ రెడ్డికి తెలియజేసేందుకు అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేస్తే దొరకపోవడంతో కొన్ని అంశాలు మీడియా ముఖంగా సీఎంకు తెలియజేశానని చెప్పారు. తాను పార్టీకి వ్యతిరేకంగా ఎప్పుడు పని చేయలేదన్నారు. అదే విధంగా షోకాజ్ నోటీస్ పై వారం రోజుల్లో సమాధానం ఇమ్మన్నారని తాను ఒక్క రోజులోనే సమాధానం పంపిస్తున్ననట్లు చెప్పారు.