https://oktelugu.com/

పాపం.. దిల్ రాజు కాస్త, నిల్ రాజు ?

టాలీవుడ్ లో దిల్ రాజు అనే వ్యక్తి ఒక బ్రాండ్.. సినిమాల రిలీజ్ కు ఆయన ఒక పెద్ద దిక్కు. మహేష్ బాబు సినిమాకైనా, ఎన్టీఆర్ సినిమాకైనా ఇలా పెద్ద హీరోల సినిమాలు పోటీలో ఉంటే.. థియేటర్ లను ఎడ్జెస్ట్ చేసేది ఆయనే. థియేటర్ల పై అధికారం సాధించి కొనసాగుతూ వస్తోన్న రాజుకు కరోనా గట్టి దెబ్బనే. ఇలాగే మరో ఏడాది థియేటర్లను ఓపెన్ చేయకపోతే.. ఇక దిల్ రాజు కాస్త, నిల్ రాజు అవ్వాల్సి వస్తోంది. […]

Written By:
  • admin
  • , Updated On : July 21, 2020 / 09:20 PM IST
    Follow us on


    టాలీవుడ్ లో దిల్ రాజు అనే వ్యక్తి ఒక బ్రాండ్.. సినిమాల రిలీజ్ కు ఆయన ఒక పెద్ద దిక్కు. మహేష్ బాబు సినిమాకైనా, ఎన్టీఆర్ సినిమాకైనా ఇలా పెద్ద హీరోల సినిమాలు పోటీలో ఉంటే.. థియేటర్ లను ఎడ్జెస్ట్ చేసేది ఆయనే. థియేటర్ల పై అధికారం సాధించి కొనసాగుతూ వస్తోన్న రాజుకు కరోనా గట్టి దెబ్బనే. ఇలాగే మరో ఏడాది థియేటర్లను ఓపెన్ చేయకపోతే.. ఇక దిల్ రాజు కాస్త, నిల్ రాజు అవ్వాల్సి వస్తోంది. థియేటర్లను వదులుకోవాల్సి వస్తోంది. అయినా సినిమా ఇండస్ట్రీలో ఎంత గొప్ప నిర్మాత అయినా ఏదొక రోజు తన ప్రభావం కోల్పోవాల్సి వస్తోంది. డెబ్భై ఏళ్ల సినిమా చరిత్రలో జరిగిన ఎన్నో సంఘటనలే ఇందుకు నిదర్శనం. ఇప్పుడు దిల్ రాజు కూడా తన నెట్ వర్క్ ను తన థియేటర్ల బిజినెస్ ను పోగొట్టుకునే పరిస్థితుల్లో ఉన్నాడు.

    ప్రభాస్‌ మూవీ కోసం దీపిక అంత తీసుకుందా!

    ఇప్పటికే చేతిలోని థియేటర్లను మెయింటైన్ చెయ్యలేక వాటిని వదిలించుకునే ఆలోచనలో ఉన్నా… వాటిని వదిలించుకునే అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో నష్టపోవడం తప్ప, ఆ నష్టాన్ని తగ్గించుకున్నే దారి కూడా లేదాయే. మరి దిల్ రాజ్ ఏమి చేస్తాడా అని ఆయనను నమ్ముకుని వ్యాపారం చేస్తోన్న పంపిణీదారులు ఆశగా ఎదురు చూస్తున్నారు. వాళ్ల బకాయిలు కూడా రాజు దగ్గర ఆగిపోయాయి. అలాగే రాజుకి కూడా చాలామంది బాకీ ఉన్నారు. ఇవ్వాల్సిన వాళ్ళు, కరోనా వంకతో మొహం చాటేయ్యడం, తానూ ఇవ్వాల్సిన వ్యక్తులేమో ఇవ్వమని ఒత్తిడి చేయడంతో మొత్తానికి రాజు.. అందరికీ సెటిల్ చేసే పనిలో ఉన్నాడు. దాంతో రాజుకు నష్టాల లెక్కలు లెక్కకు మించి ఉండే ఛాన్స్ ఉందని ఫిల్మ్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది.

    మహేశ్‌ మెచ్చిన మూవీ రీమేక్‌లో విశ్వక్‌సేన్!

    మరి నిజంగానే రాజు నష్టాల్లో మునిగిపోతే ఇన్నేళ్లు అగ్ర నిర్మాతగా ఈ తరం సినీ నిర్మాణ విభాగానికి ప్రతినిధిగా వస్తోన్న ఈ అగ్ర నిర్మాతకు ఇక ఆ గౌరవం దక్కడం కష్టమే అవుతుంది. ఇన్నాళ్లు తన నిర్మాణ సంస్థే ఒక చిన్న సినీ పరిశ్రమ అన్న స్థాయిలో దిల్ రాజు ప్రయాణం సాగింది.. పైగా ఎంతోమందికి సినిమాల్లో అవకాశాలు కల్పిస్తూ.. అలాగే సినిమాతో మంచి వ్యాపారం చేసుకుంటూ డబ్బులు చేసుకుంటున్న దిల్ రాజుకు ఈ సడెన్ సమస్యలు వస్తాయని ఎవ్వరూ ఉహించి ఉండరు.

    దీనికితోడు స్టార్ హీరోలతో కూడా దిల్ రాజుకి సినిమా బిజినెస్ విషయంలో అభిప్రాయభేదాలు ఉన్నాయట. హీరోలు రెమ్యూనరేషన్ తీసుకోకుండా నాన్-థియోటర్స్ రైట్స్ తీసుకోవడంతో రాజుకు అభ్యంతరం ఉందట. నిర్మాతలకు లాభాలు వచ్చేదే నాన్-థియోటర్స్ రైట్స్ మీద, వాటినే హీరోలు తీసుకుంటే.. ఇక నిర్మాతలకు ఏమి మిగులుతుందనేది రాజు బాధ.