Prabhas Adipurush Release Date: ప్రభాస్ మూవీ ఆదిపురుష్ కోసం ఇప్పుడు కేవలం టాలీవుడ్ ప్రేక్షకులు మాత్రమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ఎదురుచూస్తోంది. తాజాగా ఈ మూవీ విడుదలపై నిర్మాత భూషన్ కుమార్‌ను దీపావళికి విడుదలువుతుందా అని ఓ మీడియా ప్రశ్నించగా.. చాలా సినిమాలు ఇప్పటికే దీపావళికి విడుదల తేదీలను ప్రకటించాయి. దీంతో దీపావళికి ఆదిపురుష్ రాదని క్లారిటీ ఇచ్చారు. ఈ లెక్కన 2022 ముగింపులో నన్న ఆదిపురుష్ వస్తుందోమే చూడాలి.
కాగా డార్లింగ్ ప్రభాస్ కాస్త నేషనల్ స్టార్ ప్రభాస్ గా మారేసరికి బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా సినిమాలతో.. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ రేంజ్ ని పెంచుతూ పోతున్నాడు. పైగా దాదాపు 400 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మైథలాజికల్ డ్రామాలో శ్రీరాముడిగా ప్రభాస్, రావణుడిగా బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ కనిపించబోతున్నాడు. సీత పాత్రలో కృతి సనన్ నటించనుంది.
Also Read: టాలీవుడ్ లోనే అతి తక్కువ వసూళ్లు రాబట్టిన స్టార్ ఆయనే
కాగా భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాను మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో తీస్తున్నారు. తెలుగు-హిందీ భాషల్లో సైమల్టేనియస్ గా షూట్ చేసి.. మరో 7 భాషల్లో డబ్బింగ్ చేస్తారు. ఏది ఏమైనా ప్రభాస్ సినిమా అంటే.. ఇప్పుడు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీల టాలెంట్ కి గుర్తింపు అన్నట్టుగా భావిస్తున్నారు బాలీవుడ్ జనం. దానికి తగ్గట్టు నిజంగా బాలీవుడ్ సంస్థ టీసిరీస్ ఏ బాలీవుడ్ స్టార్ తోనో చేయకుండా, సౌత్ హీరోతో చేయడం నిజంగా ప్రభాస్ స్టార్ డమ్ కి దక్కిన గౌరవమే.
ఇక ప్రభాస్ ఈ సినిమాలో మూడు పాత్రాల్లో కనిపిస్తాడని.. మెలుహా ల్యాండ్స్ లో సాగే ఈ కథలో రాముడి పాత్రతో పాటు పరుశురాముడిగా కూడా ప్రభాస్ ను విజువల్ వండర్ గా చూపించబోతున్నారని వార్తలు వస్తున్నాయి.