Homeఎంటర్టైన్మెంట్సీనియర్ ఎన్టీఆర్ కుటుంబంలో విషాదం !

సీనియర్ ఎన్టీఆర్ కుటుంబంలో విషాదం !

visweswara raoకరోనా కారణంగా సినీ పరిశ్రమలో వరుస విషాదకరమైన సంఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఇప్పటికే కరోనా మహమ్మారితో సినీ ప్రముఖులు వరుసగా చనిపోతూనే ఉన్నారు. సీనియర్‌ నిర్మాత, దర్శకుడు యు.విశ్వేశ్వరరావుగారు గురువారం ఉదయం చెన్నైలో కరోనాతో కన్నుమూశారు. కొద్ది రోజులుగా కరోనా చికిత్స తీసుకుంటున్న ఆయన ఆరోగ్య ప‌రిస్థితి విష‌య‌మించ‌డంతో వెంటిలేటర్‌ పై చికిత్స అందించినా ప్రయోజనం లేకుండా పోయింది.

చివరికి ఆయన ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. యు.విశ్వేశ్వరరావు గారు అంటే ఇప్పటి తరానికి పెద్దగా తెలియదు గానీ, ఆయన ఆ రోజుల్లో చిత్ర సీమలో కీలక వ్యక్తిగా తన హవాను చూపించిన వ్యక్తి. పైగా ఆయన సీనియర్ ఎన్టీఆర్‌ కు స్వయానా వియ్యంకుడు. ఎన్టీఆర్ గారితో యు.విశ్వేశ్వరరావుగారు నిర్మాతగా ‘కంచుకోట’, ‘నిలువు దోపిడీ’, ‘దేశోద్థారకులు’ ‘పెత్తందార్లు’ వంటి గొప్ప సినిమాలను నిర్మించారు.

అయితే, ఆయన నిర్మాతగా ఎన్టీఆర్‌, పృథ్వీరాజ్‌ కపూర్‌ కాంబినేషన్‌లో ‘కంచు కాగడా’ అనే సినిమాని నిర్మించడానికి ఎంత ప్రయత్నం చేసినా ఆ సినిమాను తీయలేకపోయారు. దాంతో ఆయనకు నిర్మాణం పై చిన్న విసుగు వచ్చి… ఆ తర్వాత కాలంలో దర్శకుడిగా కూడా మారారు. దర్శకుడిగా ‘తీర్పు’, ‘మార్పు’, ‘నగ్న సత్యం’, ‘కీర్తి కాంతా కనకం’, ‘పెళ్లిళ్ల చదరంగం’ వంటి సినిమాలకు దర్శకత్వం వహించారు.

యు.విశ్వేశ్వరరావు దర్శకుడిగా నిలబడాలని, ఆయన దర్శకత్వం వహించిన ‘తీర్పు’ సినిమాలో ఎన్టీఆర్‌ జడ్జిగా అతిధి పాత్రలో కూడా నటించారు. ఇక విశ్వేశ్వరరావులో మంచి గేయ రచయిత కూడా ఉన్నారు. ‘దేశోద్థారకులు’ అనే సినిమాలో ‘ఆకలై అన్నమడిగితే పిచ్చోళ్లు అన్నారు నాయాళ్లు’ అనే అర్ధవంతమైన సాహిత్యంతో చక్కని పాటను రాసింది కూడా విశ్వేశ్వరరావు గారే.

మా ‘ఓకేతెలుగు.కామ్’ తరఫున ఈ సీనియర్‌ నిర్మాత, దర్శకుడు యు.విశ్వేశ్వరరావు గారి మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, శోహార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular