Allu Aravind: రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ ప్రధాన పాత్రలో రాబోతున్న సినిమా కోట బొమ్మాళి పీఎస్. ఈ సినిమాకు తేజ మార్ని దర్శకత్వం వహిస్తే గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ మొదలుపెట్టారు చిత్ర యూనిట్. తాజాగా సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించారు. దీనికి అగ్ర నిర్మాత అల్లు అరవింద్, అనిల్ రావిపూడి ముఖ్య అతిథులుగా వచ్చారు. ఈ కార్యక్రమం తర్వాత మీడియా ప్రతినిధులు చిత్ర బృందం తో ముచ్చటించారు.
ఇందులో అల్లు అరవింద్ ను పలు ప్రశ్నలు వేశారు ప్రతినిధులు. గతంలో పెద్ద సినిమాలు రాకపోవడానికి కారణం ఏంటి అని అడిగితే.. సినిమా ఖర్చు పెరగడం అన్నారు అల్లు అరవింద్. ఇదే ప్రశ్నకు సంబంధించిన ఖర్చు పెరగడం వల్ల పెద్ద సినిమాలు రావడం లేదన్నారు.. అంటే హీరోల రెమ్యూనరేషన్ కారణమా అంటూ ప్రశ్నించారు. దీనికి ఆసక్తి కరమైన సమాధానం ఇచ్చారు ఈ బడా నిర్మాత. సినిమా ఖర్చు పెరిగిందంటే హీరోల రెమ్యూనరేషన్ పెరిగిందని అర్థం కాదు. పెరిగిన ఖర్చులలో హీరోలు తీసుకుంటున్న రెమ్యూనరేషన్ కేవలం 20 శాతం మాత్రమే అని ఆయన తెలియజేశారు.
పెద్ద హీరోలు సినిమాలలో నటించడం వల్ల సినిమా ఖర్చులు పెరగడం లేదు. ఎక్కువ ఖర్చు చేసి సినిమాలు చేస్తున్న వాటిలో స్టార్ హీరోలు నటిస్తున్నారని అందువల్లే సినిమా ఖర్చులు పెరుగుతున్నాయని తెలియజేశారు. ఒకప్పుడు ఒక సినిమా కేవలం ఒక భాషకు మాత్రమే పరిమితమయ్యేది. అందువల్ల సినిమాకు కూడా తక్కువ ఖర్చు అయ్యేది. కానీ ఇప్పుడు మాత్రం ఒక సినిమా అన్ని భాషలలో విడుదలవుతుంది. ఇలా సినిమా రేంజ్ పెరగడంతో ఖర్చులు కూడా పెరుగుతున్నాయంటూ హీరోల రెమ్యూనరేషన్ గురించి కామెంట్స్ చేశారు అల్లు అరవింద్.