https://oktelugu.com/

Priyanka Mohan: గుడ్డిగా అడిగేస్తోంది.. ఇలా అయితే ఎలా అమ్మడు ?

Priyanka Mohan: సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ కి సింగిల్ హిట్ పడితే చాలు, నాలుగైదు సినిమా ఆఫర్లు వెతుక్కుంటూ ఆమె మీద పడిపోతాయి. ఐతే, ఆఫర్లు వచ్చే సరికి తమకు ఎక్కడా లేని డిమాండ్ ఉందని అపోహ పడి.. కోటి కావాలి, అవసరం అయితే రెండు కోట్లు కావాలి అంటూ సదరు హీరోయిన్లు తమ కోరికల చిట్టాను నిర్మాతల మెడకు చుడతారు. ప్రస్తుతం హీరోయిన్ ‘ప్రియాంకా అరుళ్ మోహన్’ తీరు అలాగే ఉంది. అడ్డు అదుపు లేకుండా […]

Written By:
  • Shiva
  • , Updated On : May 10, 2022 / 08:02 AM IST
    Follow us on

    Priyanka Mohan: సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ కి సింగిల్ హిట్ పడితే చాలు, నాలుగైదు సినిమా ఆఫర్లు వెతుక్కుంటూ ఆమె మీద పడిపోతాయి. ఐతే, ఆఫర్లు వచ్చే సరికి తమకు ఎక్కడా లేని డిమాండ్ ఉందని అపోహ పడి.. కోటి కావాలి, అవసరం అయితే రెండు కోట్లు కావాలి అంటూ సదరు హీరోయిన్లు తమ కోరికల చిట్టాను నిర్మాతల మెడకు చుడతారు. ప్రస్తుతం హీరోయిన్ ‘ప్రియాంకా అరుళ్ మోహన్’ తీరు అలాగే ఉంది. అడ్డు అదుపు లేకుండా తన రెమ్యునరేషన్ ను విచ్చలవిడిగా పెంచేసింది.

    Priyanka Mohan

    తెలుగులో ఆమె మొదటి సినిమా ‘గ్యాంగ్ లీడర్’ విడుదలకు ముందే.. ప్రియాంకా అరుళ్ మోహన్ కి తెలుగు సినిమాల్లో వరుస అవకాశాలు వచ్చాయి. దానికి తోడు ‘గ్యాంగ్ లీడర్’లో నానితో పాటు ప్రియాంకా అరుళ్ మోహన్ నటనకి కూడా మంచి పేరు వచ్చింది. మొదటి సినిమా సూపర్ హిట్ కాకపోయినా.. ఆమె సాంగ్ కి 70 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. దాంతో సినిమా హిట్ ప్లాప్ తో పని లేకుండా ‘ప్రియాంకా అరుళ్ మోహన్’కి విపరీతంగా డిమాండ్ పెరిగింది.

    Also Read: Natashiromani Kannamba Biography: నటశిరోమణి ‘కన్నాంబ’ బయోగ్రఫీ !

    ప్రస్తుతం ‘ప్రియాంకా అరుళ్ మోహన్’ చేతిలో నాలుగు చిత్రాలున్నాయి. అలాగే మరో సినిమాకు సైన్ చేయడానికి ఒప్పుకుంది. అంటే.. ప్రియాంకా చేతిలో మొత్తం 5 సినిమాలున్నాయి. ఈ రేంజ్ లో వరుసగా సినిమాలు చేస్తోంది కాబట్టే.. అమ్మడు డిమాండ్స్ ఎక్కువ అయ్యాయి. తనలాంటి హీరోయిన్ మరొకరు లేరు అన్నట్టు ‘ప్రియాంకా అరుళ్ మోహన్’ వ్యవహార శైలి ఉంది.

    Priyanka Mohan

    దాంతో మీడియం రేంజ్ సినిమాలకు ‘ప్రియాంకా అరుళ్ మోహన్’ అందుబాటులో లేకుండా పోయింది. పైగా ఒక్కో సినిమాకి 2 కోట్లు రూపాయలు తీసుకుంటుంది. అందుకే, ప్రియాంకా అరుళ్ మోహన్ తో సినిమాలు ప్లాన్ చేసుకున్న మీడియం రేంజ్ బడ్జెట్ సినిమాలు అన్నీ.. ఇప్పుడు ప్రియాంకా ప్లేస్ లో మరో హీరోయిన్ ను పెట్టుకుంటున్నారు.

    పైగా బీసీ ప్రేక్షకుల్లో ప్రియాంకా అరుళ్ మోహన్ కి పెద్దగా ఫాలోయింగ్ కూడా లేదు. ఇక గ్లామర్ విషయంలో కూడా ఆమెకు ఎన్నడూ ఫుల్ మార్క్ లు పడలేదు. అయినా వరుసగా తనకు ఆఫర్లు వచ్చేసరికి ఈ భామకు ఏమి చేయాలో ఎంత అడగాలో అర్థం కాక అసలుకే మోసం వచ్చేలా చేసుకుంటుంది. గుడ్డిగా భారీ రెమ్యునరేషన్ ను అడిగేస్తోంది. ఇలా అయితే.. కెరీర్ ఎక్కువ రోజులు సాగదు.

    Also Read:M S Raju: అరెరే.. బూతులో మునిగితేలుతున్న రాజు గారు !

    Recommended Videos


    Tags